ETV Bharat / state

రక్తదానం చేసి.. ప్రాణాలు కాపాడుతున్న యువకులు!

కరోనా రోజురోజుకు విజృంభిస్తుండటం వల్ల పలువురు రక్తదానం చేయడానికి కూడా జంకుతున్నారు. ఆదిలాబాద్​ రిమ్స్​కి వచ్చి.. రక్తదానం చేయాలంటే భయపడుతున్నారు. కాగా కొందరు మాత్రం ధైర్యంగా ముందుకు వచ్చి మానవతా దృక్పథంతో రక్తదానం చేస్తూ ప్రాణాపాయంలో ఉన్నవారికి కొత్త జీవితాలను ప్రసాదిస్తున్నారు. తాజాగా ఓ యువకుడు రక్తదానం చేసి కరోనా బాధితుడి ప్రాణాలు కాపాడాడు.

author img

By

Published : Sep 7, 2020, 11:49 AM IST

youth Donates Blood And Saves Many Lives
రక్తదానం చేసి.. ప్రాణాలు కాపాడుతున్న యువకులు!

ప్రస్తుత రోజుల్లో కరోనా రోజురోజుకు విజృంభిస్తున్నది. బాధితులకు రక్తదానం, ప్లాస్మా దానం చేయడానికి భయపడుతుండగా.. కొంతమంది యువకులు మాత్రం ధైర్యంగా ముందుకు వచ్చి.. రక్తదానం, ప్లాస్మాదానం చేస్తున్నారు. జిల్లాలోని గుడిహత్నూర్‌ మండలం మన్నూర్‌కు చెందిన శ్యామ్​రావుకు ప్లేట్‌లెట్స్‌ గణనీయంగా పడిపోయి ప్రాణాపాయ స్థితిలో రిమ్స్‌లో చేరాడు. అతనికి అవసరమైన బి పాజిటివ్‌ రక్తం అందుబాటులో లేక ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు.

ఈ పరిస్థితుల్లో కుటుంబ సభ్యులు ఐఆర్‌సీ సమన్వయకర్త రూపేష్‌రెడ్డిని సంప్రదించారు. వెంటనే స్పందించిన రూపేష్​ రెడ్డి బేల మండలం సాంగిడి గ్రామానికి చెందిన మిత్రుడు ఎల్మ అమరేందర్‌రెడ్డిని రక్తదానం చేయమని అడిగాడు. వెంటనే రిమ్స్​ ఆస్పత్రికి వచ్చిన అమరేందర్​ రెడ్డి రక్తదానం చేసి ప్రాణాపాయ స్థితి నుంచి కాపాడారు. రక్తహీనతతో బాధపడుతున్న ఒక బాబుకు స్వేరోస్‌ సంయుక్త కార్యదర్శి రాచర్ల నారాయణ రక్తదానం చేసి ప్రాణాలు కాపాడారు. రక్తదాతలను స్వేరోస్‌ జిల్లా అధ్యక్షుడు పెంటపర్తి ఊషన్న తదితరులు అభినందించారు.

ఇదీ చదవండి: "నా సొరకాయలు పోయాయి సార్..!"

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.