ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాల్లోని దళితుల సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని జడ్పీ ఛైర్మన్ అన్నారు. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండల కేంద్రంలో ఐటీడీఏ ముందు దళితుల జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరాహార దీక్ష శిబిరానికి ఆయన చేరుకున్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లోని దళితులు ఎదుర్కొంటున్న సమస్యలను జిల్లాలోని ఎమ్మెల్యేలు, తాను సీఎం కేసీఆర్కు విన్నవించామని తెలిపారు.
ఏజెన్సీ ప్రాంతాల్లోని దళితుల సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తామని కేసీఆర్ సానుకూలంగా స్పందించారని పేర్కొన్నారు. త్వరలో సీఎం కేసీఆర్కు మరోమారు సమస్యలను విన్నవించి వాటిని పరిష్కరించేందుకు తనవంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అనంతరం దీక్షలో పాల్గొన్న వారికి నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింపజేశారు.
ఇదీ చూడండి : సాగర్ ఉప ఎన్నికలో పోటీ చేయట్లేదు: తీన్మార్ మల్లన్న