ETV Bharat / state

ఆదిలాబాద్​లో మళ్లీ  పులి సంచారం.. స్థానికుల్లో భయం!

ఆదిలాబాద్​ జిల్లా పెన్​గంగ పరిసర ప్రాంతాల్లో పులి సంచారం స్థానిక  ప్రజలను కలవరపెడుతున్నది. భీంపూర్​ మండల పరిధిలోని గొల్లఘాట్​  పరిసర ప్రాంతాల్లోని పంటచేలు, వాగుల్లో పులి అడుగులు గమనించిన రైతులు, స్థానికులు భయాందోళనలకు గురవుతున్నారు. పులి సంచారం గురించి అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు.

author img

By

Published : Aug 1, 2020, 7:35 AM IST

Tiger moment in  adilabad bheempur mandal area
ఆదిలాబాద్​లో మళ్లీ  పులి సంచారం.. స్థానికుల్లో భయం!

ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలం గొల్లఘాట్ పరిసర ప్రాంతాలలో పులి సంచారం స్థానికులను కలవరపెడుతోంది. పంట చేలలో పులి పాద ముద్రలు గమనించిన స్థానికులు అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. అడుగులు పరిశీలించి అవి పులి అడుగులేనని, ఆ ప్రాంతంలో పులి తిరుగుతున్నదని నిర్ధారించారు. అటవీ ప్రాంతం వైపు, పంట చేలవైపు వెళ్ళొదని గ్రామస్థులకు హెచ్చరించారు.

మహారాష్ట్ర సరిహద్దు పెన్​ గంగ నది అవతల ఉన్న తిప్పేశ్వర్ అభయారణ్యం నుంచి పులి తరచు భీంపూర్ సరిహద్దు గ్రామాల్లో తిరుగుతుంది. ఇది తరచూ జరిగేదే. అయితే.. ఈ సారి పెన్​గంగ నది ఉధృతంగా ప్రవహిస్తున్న తరుణంలో పులి నది దాటి ఇటు వైపు ఎలా వచ్చిందనే విషయం అటవీ శాఖ అధికారులకు అంతు పట్టకుండా పోయింది. పులి నది దాటే పరిస్థితి లేకపోవడం.. అయినా.. ఆయా పరిసరాల్లో పులి సంచారం పెన్​గంగ సరిహద్దు ప్రాంతాల్లో ప్రజల్లో భయం కలిగిస్తోంది. పులి అడుగులు కనిపించిన ప్రాంతంలో రైతులు భయంతో పంట చేలకు వెళ్లడం మానేశారు.

ఇవీ చూడండి: 'రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీలకు రక్షణ లేకుండా పోతోంది'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.