ఆదిలాబాద్ జిల్లా బజార్‌హత్నూర్ మండలంలో ఈదురుగాలు బీభత్సం సృష్టించాయి. మండల కేంద్రంతోపాటు మడగూడ, కోలారి తదితర గ్రామాల్లో రబీ పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. 5 నిమిషాల పాటు వీచిన ఈదురుగాలులకు ఇళ్లపై రేకులు ఎగిరిపోయి ఇంట్లో వస్తువులపై రాళ్లు పడ్డాయి.
ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవటం వల్ల అంతా ఊపిరి పీల్చుకున్నారు. పంట ధాన్యాలు తడిసి ముద్దయ్యాయి. ప్రభుత్వ అధికారులు వెంటనే స్పందించి తమను ఆదుకోవాలని బాధితులు కోరారు.
ఇదీ చూడండి : కరోనా భయంతో డీమార్ట్‌లో పరీక్షలు!