ఆదిలాబాద్‌లోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో ఓ విశ్రాంత ప్రధానోపాధ్యాయుడి నిర్వాకం బయట పడింది. సదరు ప్రధానోపాధ్యాయుడు తాను పని చేసిన రెండేళ్ల కాలంలో సహచర ఉపాధ్యాయులకు సంబంధించిన జీపీఎఫ్, ఇంక్రిమెంట్లు దాదాపు 20 లక్షలు స్వాహా చేశాడు. ఆరు నెలల క్రితం పదవీ విరమణ పొందాడు. కాగా కొత్తగా బాధ్యతలు చేపట్టిన పద్మ.... విశ్రాంత ప్రధానోపాధ్యాయుడు తనకు ఉపాధ్యాయుల జీతభత్యాల వివరాలు ఇవ్వడం లేదని ట్రెజరీ అధికారులకు సమాచారం అందించింది. వారు విచారణ చేపట్టగా ఈ అక్రమ బాగోతం బయటపడింది. ఈ విషయమై ఇప్పటికే ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినట్లు ప్రస్తుత ప్రధానోపాధ్యాయురాలు పద్మ తెలిపారు.
ఇదీ చూడండి : రవాణాశాఖ నిర్ణయించిన ధరకే నిమజ్జన వాహనాలు...!