జీఎస్టీ ప్రారంభమైన కొత్తలో రాష్ట్రాలకు కష్టం వస్తే కొంత కాలం పాటు వాటిని కేంద్రమే భరిస్తుందని చెప్పారని సీపీఐ (భారతీయ కమ్యూనిస్టు పార్టీ) గుర్తుచేసింది. చట్టంలో ఈ విషయాన్ని స్పష్టంగా పేర్కొన్నారని తెలిపింది. తెలంగాణ రాష్ట్రానికి రావలసిన జీఎస్టీ పరిహారాలను చెల్లించాలంటూ ఆదిలాబాద్ కలెక్టరేట్ వద్ద సీపీఐ కార్యకర్తలు నిరసన కార్యక్రమం చేపట్టారు.
కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరిని విడనాడి.. రాష్ట్రానికి రావాల్సిన జీఎస్టీ బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి దుర్గం నూతన కుమార్, సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు తిరుపతి, దుర్గం లింగం, లింగన్న, విలాస్, తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి: పీవీ గ్లోబల్ ఇండియా రూపశిల్పి.. : కేసీఆర్