ETV Bharat / state

పొరుగు రాష్ట్రంలో ఓటెత్తారు - తెలంగాణలో పోలింగ్‌కు మనమూ పోటెత్తాలి - EC Arrangements for Telangana Assembly Elections

Telangana Assembly Elections 2023 : తెలంగాణ శాసనసభ ఎన్నికలో అభ్యర్థుల ప్రచారం నువ్వానేనా అన్నట్లు సాగుతోంది. దీంతో పార్టీలన్ని పట్టణాలు, గ్రామాలను చుట్టేస్తున్నాయి. అందరూ ఓటర్లను ఆకర్షించే పనిలో పడ్డారు. తాజాగా మరోవైపు గ్రామీణ ప్రాంతాలతో పోల్చితే పట్టణాల్లో మాత్రం ఓటు వేసేందుకు.. ఓటర్లు నిర్లిప్తత ప్రదర్శిస్తున్నారు. తద్వారా మెజార్టీ ప్రజల నిర్ణయానికి అనుగుణంగా పాలకులను ఎన్నుకునే అవకాశాన్ని కోల్పొతున్నారు.

Telangana Assembly Elections 2023
Telangana Assembly Elections 2023
author img

By ETV Bharat Telangana Team

Published : Nov 25, 2023, 2:41 PM IST

Telangana Assembly Elections 2023 : రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు (Telangana Assembly Elections) దగ్గరపడుతున్న కొద్దీ.. గెలుపు కోసం పార్టీలు పలు వ్యూహాలతో ముందుకు వెళ్తున్నాయి. జాతీయ నాయకులు, రాష్ట్ర నేతలు, అభ్యర్థులు సుడిగాలి పర్యటనలతో ప్రజల వద్దకు వెళ్తూ.. ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. ఎలాగైనా ఎన్నికల్లో గెలవాలనే లక్ష్యంతో పార్టీలు పోటీ పడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఒక్క ఛాన్స్​ కోసం కొందరు.. మరో ఛాన్స్​ కోసం మరికొందరు తీవ్రంగా శ్రమిస్తున్నారు.

Telangana Assembly Elections Polling 2023 : తాజాగా ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాకు.. సరిహద్దు రాష్ట్రంగా ఉన్న ఛత్తీస్‌గఢ్‌లో ఎన్నికలు జరిగాయి. ఓవైపు ఆ రాష్ట్రానికి దట్టమైన అడవులతో పాటు.. మరోవైపు మావోయిస్టులు ప్రాబల్యమూ ఎక్కువే. అలాంటి తరుణంలో అక్కడి ఓటర్లు రాజ్యాంగం తమకు కల్పించిన ఓటు హక్కును వజ్రాయుధంగా చేసుకుని ఓటింగ్‌లో పాల్గొన్నారు. కానీ ఛత్తీస్‌గఢ్‌లో ఉన్నంత నిర్బంధం ఇక్కడ లేకున్నా.. చదువుకున్న వారు, పట్టణ ప్రాంత వాసులు పోలింగ్‌ కేంద్రాలకు వచ్చి ఓటు వేయడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారు. నిరక్షరాస్యులు ఎక్కువగా ఉండే ఆ రాష్ట్రంలో ప్రజలు చూపిన తెగువ, అలాంటి స్ఫూర్తిని మనమూ చాటాలి. పట్టణ ప్రాంత వాసులు వీరి స్ఫూర్తితో వందశాతం దిశగా అడుగులు వేయాలి.

ఎన్నికలు వస్తున్నాయ్ బాస్ - పోస్టల్ ఓటు జాగ్రత్తగా వేయ్

గతం కారాదు పునరావృతం : తెలంగాణలో ఓటింగ్‌ శాతాన్ని పెంచేందుకు రాష్ట్ర సర్కార్ ఏటా ఎన్నో కార్యక్రమాలు చేపడుతోంది. దీంతో పాటు పలు స్వచ్ఛంద సంస్థలతో అవగాహన ర్యాలీలు, చైతన్య సదస్సులు నిర్వహిస్తోంది. తద్వారా ఫలితాలు కూడా బాగానే వస్తున్నాయి. గతంతో పోలిస్తే ఇటీవల జరిగిన వరుస ఎన్నికల్లో ఓటింగ్‌ సరళి పెరిగినప్పటికీ.. గ్రామీణ ప్రాంతాలతో పోల్చితే పట్టణాల్లో మాత్రం వెనుకంజలోనే ఉన్నారు. దగ్గరలోనే పోలింగ్‌ కేంద్రాలు, అన్ని సదుపాయాలు ఉండి విద్యావంతులు అయినప్పటికీ ఓటు వేయడంలో నిర్లిప్తత చోటుచేసుకుంటుంది.

పనులన్నీ వదులుకుని ఓటు వేయడం అవసరమా అనే ధోరణి ఇంకా కనిపిస్తోంది. ఒకటి రెండు ఓట్లతోనే ఫలితాలే తారు మారైన సంఘటనలు ఉన్నప్పటికీ ఓటు వేయడాన్ని చాలా మంది బాధ్యతగా గుర్తించడం లేదు.. ప్రతీ ఒక్కరు తమ బాధ్యతగా దీనిని గుర్తించిన నాడే మెజార్టీ ప్రజల నిర్ణయానికి అనుగుణంగా పాలకులను ఎన్నుకునే అవకాశం ఉంటుంది.

గెలుపే మంత్రంగా.. లక్ష ఓట్లే టార్గెట్‌గా అభ్యర్థుల జపం

మంచిర్యాల జిల్లాలో : గత శాసనసభ ఎన్నికల్లో మంచిర్యాల జిల్లాలో.. 78.72 శాతం పోలింగ్‌ నమోదైంది. కానీ పట్టణ ప్రాంతాలతో పోలిస్తే గ్రామీణ ప్రాంతాల్లోనే ఎక్కువ శాతం నమోదు కావడం గమనార్హం. మంచిర్యాల మండలంలో 68.26 శాతం, నస్పూర్‌లో 64.16 శాతం పోలింగ్ నమోదైంది.

ఆదిలాబాద్‌ జిల్లాలో : ఆదిలాబాద్‌ జిల్లాలో మొత్తం 81.64 శాతం పోలింగ్‌ నమోదైంది. ఇందులో ఆదిలాబాద్‌ పట్టణంలో మాత్రం 70 శాతం లోపే నమోదుకాగా.. గ్రామీణ ప్రాంతాల్లోనే అత్యధికంగా ఓటింగ్‌ కావడం గమనార్హం. బేల మండలంలో 90.49 శాతం నమోదైంది.

నిర్మల్‌ జిల్లాలో : నిర్మల్‌ జిల్లాలో మొత్తం 80.52శాతం ఓటింగ్‌ నమోదైంది. నిర్మల్‌ పుర పాలికలో 67,153 మంది ఓటర్లకు 45,732 మంది మాత్రమే ఓటు హక్కును వినియోగించుకున్నారు. అంటే 68.10 శాతం మాత్రమే ఓటింగ్‌ నమోదైంది. గ్రామీణ ప్రాంతాల్లో పరిశీలిస్తే లక్ష్మణాచాంద మండలంలో 90శాతం నమోదైంది. చంద్రపూర్‌లో 91.84, పార్‌వెల్లిలో 91.50శాతం మంది ఓటు వేశారు.

'మా భవిష్యత్‌కు భరోసా ఇచ్చే నాయకుడికే ఓటేస్తాం'

కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా : కుమురం భీం ఆసిఫాబాద్‌ జిల్లా వ్యాప్తంగా 86 శాతం ఓటర్లు ఓటేశారు. కాగజ్‌నగర్‌ పట్టణ ప్రాంతానికి వస్తే ఇక్కడ 43,487 మంది ఓటర్లుండగా కేవలం 28,731 మంది అంటే 66.06 శాతం ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అయితే ఈ ఓటింగ్‌ అంతా గ్రామీణ, మారుమూల ప్రాంత ప్రజలు వేసిందే కావడం గమనార్హం. రెబ్బెన మండలంలో 87.08 శాతం ఓటింగ్ నమోదు కాగా, వాంకిడి మండలంలో 86 శాతం ఓటు వేసి ఆదర్శంగా నిలిచారు. ఇక గ్రామీణ ప్రాంతాల్లో 85 శాతానికి పైనే ఓటు హక్కును వినియోగించుకున్నారు.

ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రచార జోరు - మేనిఫెస్టో వివరిస్తూ ఓట్లు అభ్యర్థిస్తున్న నేతలు

సమయం లేదు మిత్రమా - అసెంబ్లీ పోలింగ్​కు ఈసీ చకచకా ఏర్పాట్లు

ప్రధాన పార్టీ అభ్యర్థులకు తలనొప్పిగా మారిన ఒకే పేరుతో ఉన్న స్వతంత్ర అభ్యర్థులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.