మిడతల కదలికలపై అధికార యంత్రాంగానికి దిశా నిర్దేశం చేసేందుకు ఐదుగురు సభ్యులతో కూడిన రాష్ట్ర కమిటీ బృందం ఆదిలాబాద్‌కు చేరుకుంది. కలకలం రేపుతోన్న మిడతల దండుపై తొలుత తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దులోని పెన్ గంగా సరిహద్దు ప్రాంతాల్లో ఏరియల్ సర్వే చేపట్టారు.
ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ శ్రీదేవసేనతో సమావేశమైన అనంతరం ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల పరిసరాల్లో ఏరియల్ సర్వే నిర్వహించారు. అనంతరం రెండు జిల్లాల అధికారులతో సమీక్షించి దిశానిర్దేశం చేయనున్నారు.