ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్, ఇంద్రవెల్లి, నార్నూర్ మండలాల్లోని పలు ప్రాంతాల్లో ఉదయం నుంచి వర్షం కురుస్తున్నందున ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. మండలాల్లో ఉదయం నుంచి దట్టమైన మేఘాలు కమ్ముకున్నాయి. ఉరుములు మెరుపులతో పాటు వర్షం కురుస్తోంది. రోడ్లపై నిలిచిన వాన నీటితో ఆయా మండలాల ప్రజలు ఇళ్ల నుంచి వచ్చేందుకు అవస్థలు పడుతున్నారు.

చేతికొచ్చిన సోయా పంటతో పాటు పత్తి పంట నల్లపడుతుందని మండలాల్లోని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంట నష్టపోయిన అన్నదాతలను ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు.
ఇదీ చదవండి: హైదరాబాద్లో భారీ వర్షం.. రోడ్లన్నీ జలమయం