ETV Bharat / state

నిధులున్నా అభివృద్ధి సున్నా- పట్టణంలో కనిపించని సుందరీకరణ - adilabad district news

ఆదిలాబాద్‌ అంటే ... తెలంగాణ కశ్మీరం. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తరుచూ అనే మాటలివి. కానీ ఆదిలాబాద్‌ మున్సిపాలిటీలో సహజసిద్ధమైన అటవీ సంపదను మినహాయిస్తే మిగిలిన సుందరీకరణ ఎక్కడా కనిపించదు. పట్టణంలో ప్రధాన కూడళ్లతో పాటు.. రహదారులు, మురికి కాలువల పరిస్థితి మరీ అధ్వానంగా మారింది.

no development in adilabad
నిధులున్నాకానరాని అభివృద్ధి- పట్టణంలో కనిపించని సుందరీకరణ
author img

By

Published : Sep 30, 2020, 1:39 PM IST

ఆదిలాబాద్‌ మున్సిపాలిటీ... పట్టణ విస్తీర్ణంలో భాగంగా 49 వార్డులకు చేరింది. జనాభా 1.55 లక్షల పైచిలుకుగా చేరినప్పటికీ సుందరీకరణ మాత్రం నామమాత్రంగానే ఉంది. పట్టణ పరిధిలోని ప్రధాన కేంద్రాలైన అంబేడ్కర్‌చౌక్‌, గాంధీచౌక్‌, నేతాజీచౌక్‌, శివాజీచౌక్‌, వివేకానందచౌక్, ఎన్టీఆర్‌చౌక్‌, పంజాబ్‌చౌక్‌, కలెక్టరేట్‌ చౌక్‌, ఠాకూర్‌హోటల్‌ వద్ద కనీసం సెంట్రల్‌ లైటింగ్‌ విధానం సక్రమంగా లేదు. ఫౌంటెయినింగ్‌, పచ్చగడ్డి, విద్యుత్‌ దీపాలతో పాటు ప్రజల దృష్టిని ఆకర్షించాల్సిన కూడళ్లు... కేవలం చిరువ్యాపారులకు అడ్డాలుగా మారిపోతున్నాయి. జనాభా పెరుగుదలకు అనుగుణంగా సుందరీకరణ కనిపించకపోవడం వల్ల పట్టణమంతా బోసిపోయినట్లుగా కనిపిస్తోంది.

నిధులున్నా.. కానరాని అభివృద్ధి

మున్సిపాలిటీ పరిధిలో అభివృద్ధి కోసం ప్రభుత్వం 2017లో రూ. 27 కోట్లు, 2018లో మరో రూ. 28 కోట్లను విడుదల చేసింది. పట్టణ శివారు ప్రాంతమైన మావల మొదలుకొని చాందా(టి) వరకు పాతజాతీయ రహదారి వెడల్పు, విద్యుదీకరణకోసం మరో రూ. 44 కోట్లను మంజూరు చేసింది. కానీ మున్సిపాలిటీ‌, ఆర్అండ్​బీ శాఖల మధ్య సమన్వయలోపం వల్ల పనులు ముందుకు సాగడంలేదు.

మురుగు పారేది రోడ్లపైనే..

పట్టణ పరిధిలో మొత్తం 409 కిలోమీటర్ల మేర రోడ్ల వైశాల్యం ఉంటే... సీసీ రోడ్లు కలిగిన వైశాల్యం కేవలం 207 కిలోమీటర్లే. బీటీ రోడ్ల వైశాల్యం 38 కిలోమీటర్లయితే కంకర, మట్టిరోడ్ల వైశాల్యం 164 కిలోమీటర్లతో విస్తరించి ఉంది. మురికి కాలువల విస్తీర్ణం మొత్తం 720 కిలోమీటర్లయితే... సీసీతో ఉన్నవి 518 కిలోమీటర్లు. ఫలితంగా మురికినీరు రహదారులను ముంచెత్తుతోంది.

ప్రభుత్వశాఖల మధ్య సమన్వయ లోపం, ఉన్నతాధికారులు సకాలంలో స్పందించకపోవడం వల్ల పనుల ప్రగతికి అవరోధంగా మారుతోంది. ప్రజాప్రతినిధులు, మున్సిపల్‌ పాలకవర్గం స్పందిస్తే గాని... సుందరీకరణ పనుల్లో వేగం కనిపించే పరిస్థితి లేదని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.

ఇదీ చూడండి: మూడో ఏడాదీ మొదటిస్థానం రావడంపై కేటీఆర్ హర్షం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.