MP Soyam Bapurao: రాష్ట్రప్రభుత్వం జీవో నంబర్ 317ను తీసుకొచ్చి ఐదో షెడ్యూల్‌ను పరిగణలోకి తీసుకోలేదని ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపూరావు అన్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లో గిరిజనేతరులు పట్టాలు పొందడం వల్ల గిరిజనులు నష్టపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. పలువురు ఆదివాసీ నేతలతో కలిసి రాజ్‌భవన్‌లో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌ను కలిశారు.
గవర్నర్ పరిధిలో ఐదో షెడ్యూల్ ఉన్నందున కాపాడాలని కోరినట్లు బాబూరావు చెప్పారు. ఐదో షెడ్యూల్ పరిధిలో పనిచేస్తున్న ఉద్యోగులు వేరే ప్రాంతంలోకి వెళ్లే పరిస్థితి వచ్చిందన్నారు. దీంతో ఆదివాసీ గిరిజన ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు తెలిపారు. జనవరి 9న భద్రాచలంలో ఆదివాసీ సమ్మేళన నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ సమ్మేళనానికి 9 తెగలకు చెందిన వారు హాజరవుతున్నారని.. గవర్నర్‌ను రావాలని కోరినట్లు బాబూరావు తెలిపారు.
'జీవో 317లో ఐదో షెడ్యూల్‌ను ప్రభుత్వం పరిణనలోకి తీసుకోలేదు. గవర్నర్ పరిధిలో ఐదో షెడ్యూల్ ఉంటుంది. అందువల్లే గవర్నర్‌ను కలిసి విన్నవించాం. ఐదో షెడ్యూల్ పరిధిలో ఉన్న ఉద్యోగులు స్థానికేతరుల పేరుమీద వేరే ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తోంది.'
- సోయం బాపూరావు, ఆదిలాబాద్ ఎంపీ
ఇదీచూడండి: Bandi Sanjay Comments on Cm Kcr: 'సీఎం కేసీఆర్‌వి బార్-దర్బార్ నిర్ణయాలే'