ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండలంలోని రామ్గూడ, దంతనపల్లి, ఉట్నూర్, కన్నాపూర్ పరిసర ప్రాంతాలను ఎమ్మెల్యే రేఖ నాయక్ సందర్శించారు. దంతనపల్లి, రామ్గూడ వాసులకు నిత్యావసర సరకులను పంపిణీ చేశారు.
అనంతరం ఉట్నూర్ మండల కేంద్రంలో నూతనంగా నిర్మించిన డబుల్ బెడ్ రూమ్లను పరిశీలించారు. వాటిని త్వరితగతిన పూర్తి చేసి లబ్ధిదారులకు అందేలా కృషి చేయాలని కోరారు. కన్నాపూర్ వాగుపై వంతెన నిర్మాణం పనులు గతంలో ప్రారంభిస్తే అటవీశాఖ అధికారులు అడ్డుకున్నారని... వెంటనే అటవీ శాఖ అధికారులతో మాట్లాడుతానని అన్నారు. ఈ సమస్యను జిల్లా పాలనాధికారి దృష్టికి తీసుకెళ్లి నిర్మాణ పనులు జరిగేలా చూస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.