ETV Bharat / state

'సంపూర్ణ పారిశుధ్యమే లక్ష్యంగా ట్రాక్టర్ల పంపిణీ' - MINISTER INDRAKARAN REDDY DISTRIBUTED TRACTORS IN ADHILABAD

గ్రామపంచాయతీలకు ట్రాక్టర్ల పంపిణీ కార్యక్రమాన్ని ఆదిలాబాద్​లో మంత్రి ఇంద్రకరణ్​రెడ్డి ప్రారంభించారు. కలెక్టర్​ దివ్యదేవరాజన్​, ఎమ్మెల్యే జోగురామన్నతో కలిసి 40 ట్రాక్టర్లను పంపిణీచేశారు.

MINISTER INDRAKARAN REDDY DISTRIBUTED TRACTORS IN ADHILABAD

author img

By

Published : Dec 16, 2019, 9:56 PM IST

గ్రామాలు పరిశుభ్రంగా ఉంటేనే ప్రజలంతా ఆరోగ్యంగా ఉంటారని మంత్రి ఇందకరణ్ రెడ్డి తెలిపారు. పల్లె ప్రగతిలో భాగంగా ప్రతీ గ్రామ పంచాయతీకి ట్రాక్టర్లు పంపిణీ చేసే మొదటి విడత కార్యక్రమాన్ని ఆదిలాబాద్​లో మంత్రి ప్రారంభించారు. జిల్లాలో 40 ట్రాక్టర్లను పంపిణీ చేశారు. రెండవ విడత జనవరి 2 నుంచి 11 వరకు జరగనున్నట్లు మంత్రి తెలిపారు. గ్రామాల్లో సంపూర్ణ పారిశుద్ధ్యం దిశగా ట్రాక్టర్లను వినియోగించాలని సూచించారు. గతంలో నిర్వహించిన 30 రోజుల ప్రణాళికను విజయవంతం చేసినట్లుగానే ఈ పది రోజుల ప్రణాళికనూ... గ్రామ పంచాయతీలు సమర్థవంతంగా నిర్వహించాలన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పంచాయతీలన్నీ సంక్రాంతిలోపు ట్రాక్టర్లు కొనుగోలు చేయాలన్నారు. మంచి ఫలితాలు చూపిన పంచాయతీలను ఎంపిక చేసి రాష్ట్ర ప్రభుత్వం నుంచి పురస్కారాలు అందిస్తామని మంత్రి ఇంద్రకరణ్​రెడ్డి తెలిపారు.

'సంపూర్ణ పారిశుధ్యమే లక్ష్యంగా ట్రాక్టర్ల పంపిణీ'

ఇదీ చూడండి : పాత్రికేయులు, రాజకీయ నాయకుల బంధం విచిత్రమైనది: కవిత

sample description

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.