ETV Bharat / state

కొరవడిన పర్యవేక్షణతో... లోపిస్తున్న నాణ్యత - నాణ్యత లోపిస్తున్న పట్టణ ప్రగతి

ఆదిలాబాద్‌ మున్సిపాలిటీ పరిధిలో కొనసాగుతున్న అభివృద్ధి పనుల నిర్వహణపై... అధికారుల పర్యవేక్షణ కొరవడుతోంది. నాణ్యత ప్రమాణాలు పాటించడంలో పారదర్శకత లోపిస్తోంది. అభివృద్ధి పనులకోసం ప్రభుత్వం కోట్లాది రూపాయలు కేటాయిస్తున్నప్పటికీ... అధికారుల మధ్య సమన్వయంలోపించడంతో గుత్తేదారులకు అన్నివిధాలుగా కలిసివస్తోంది.

low-quality-in-pattana-pragathi-works-in-adilabad
కొరవడిన పర్యవేక్షణతో... లోపిస్తున్న నాణ్యత
author img

By

Published : Mar 5, 2021, 12:51 PM IST

ఆదిలాబాద్‌ మున్సిపల్‌ పరిధిలో 28కోట్ల 30లక్షల వ్యయంతో చేపట్టిన అభివృద్ధి పనుల నిర్వహణలో... నాణ్యతలేమి కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. ప్రధానంగా 9.5కి.మీ వైశాల్యంతో చేపట్టిన డ్రైనేజీలు, నాలుగు కిలోమీటర్ల వైశాల్యంతో చేపట్టిన సీసీ రోడ్ల నిర్మాణం, మరో ఆరున్నర కి.మీ వైశాల్యంతో కొనసాగుతున్న బీటీ రోడ్ల నిర్మాణంతో పాటు 1.8 కి.మీ వైశాల్యంతో చేపట్టిన డివైడర్ల నిర్మాణంలో నాణ్యత కనిపించడంలేదు. టెండర్ ఒప్పందంలో 2020 ఏప్రిల్ నాలుగో తేదీలోగా పనులు పూర్తిచేయాల్సి ఉండగా... ఇప్పటికీ పూర్తికాలేదు.

low-quality-in-pattana-pragathi-works-in-adilabad
అసంపూర్తిగా పనులు

కొరవడిన పర్యవేక్షణ..

ఆర్​అండ్​బీ, మున్సిపల్‌ అధికారుల మధ్య సమన్వయం లేకపోవడంతో ప్రగతి పనులపై పర్యవేక్షణ కొరవడుతోంది. ఫలితంగా గుత్తేదారులు చేసిందే పని అన్నట్లుగా కొనసాగుతోంది. డివైడర్లు, డ్రైనేజీలతోపాటు రోడ్ల పనులకు పెద్దవాగు ఇసుకను వినియోగించాలనే నిబంధనలకు భిన్నంగా... స్థానికంగా లభించే నల్లటి ఇసుకను వినియోగిస్తున్నారు. దీంతో పనులు పూర్తికాకుండానే నిర్మాణాలు పగులు తేలుతున్నాయి.

నాణ్యత లోపించిన వైనం

విమర్శలకు తావిస్తోంది..

మున్సిపల్‌ కార్యాలయం ఎదుట మూడు కోట్ల వ్యయంతో చేపట్టిన పరిపాలన భవనం... 2020 జులైకి పూర్తిచేయాల్సి ఉంది. కానీ... ఇంకా పూర్తికాకపోవడం పలు విమర్శలకు తావిస్తోంది. అధికారులు, గుత్తేదారుల మధ్య ఉన్నలోపాయికారి ఒప్పందంతో పనుల నిర్వహణ పట్టు తప్పుతోందని స్థానికులు ఆరోపిస్తున్నారు.

రాష్ట్రంలో పట్టణాల ప్రగతికి అత్యంత ప్రాధాన్యతను ఇస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటిస్తుంటే... ఆదిలాబాద్‌ మున్సిపల్‌ పరిధిలో దానికి భిన్నంగా జరగుతోంది. అధికారుల మధ్య సమన్వయలోపమే ప్రధాన అవరోదంగా మారుతోంది.

ఇదీ చూడండి: రోడ్డు సదుపాయం కరవు.. భుజాన డోలీ బరువు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.