తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దులోని ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలం వడూర్ గ్రామ శివారులో పెన్ గంగ నదీతీరంలో కార్తిక దీపోత్సవం కార్యక్రమం శోభాయమానంగా జరిగింది. శబరిమాత ఉపాసకులు స్వామి శివనంద మహారాజ్ ఆధ్వర్యంలో పెన్ గంగానదికి మహా హారతిని నిర్వహించారు.
కార్తిక మాసాన్ని పురస్కరించుకొని జరిగిన ఈ వేడుకకు తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దు గ్రామాల మహిళలు, ప్రజలు భారీగా తరలివచ్చారు. గౌరీ వ్రతం, ప్రత్యేక భజనలతో నదీతీరం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. భక్తుల కోసం వడూర్, ఆర్లి గ్రామస్థులు అన్ని రకాల సౌకర్యాలను కల్పించారు. కార్తీక దీపోత్సవం ప్రాధాన్యతను స్వామీజీ వివరించారు.
ఇదీ చూడండి: 1000 స్తంభాల ఆలయానికి పోటెత్తిన భక్తులు