ETV Bharat / state

ఆదిలాబాద్​లో 46.3 డిగ్రీలకు పెరిగిన ఉష్ణోగ్రతలు - heavy temperature increase in adilabad

భానుడు పగబట్టినట్లు ఆదిలాబాద్​ జిల్లాలో పగటి ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. జనం ఉక్కపోతతో ఇబ్బంది పడుతున్నారు. లాక్​డౌన్ సడలింపులతో కార్యాలయాలకు, పనులకు వెళ్లే వారు... ఎండ తీవ్రతతో అల్లాడిపోతున్నారు.

heavy temperature increase in adilabad
ఆదిలాబాద్​లో 46.3 డిగ్రీలకు పెరిగిన ఉష్ణోగ్రతలు
author img

By

Published : May 25, 2020, 1:09 PM IST

ఆదిలాబాద్‌ జిల్లాలో ఎండల తీవ్రత క్రమంగా పెరుగుతోంది. సోమవారం పగటి ఉష్ణోగ్రత 46.3 డిగ్రీలకు చేరుకుంది. రెండురోజుల కిందట 44 డిగ్రీలుగా ఉన్న ఉష్ణోగ్రతలు... ఆదివారం 45.8గా నమోదైంది. సోమవారం ఏకంగా 46.3 కు చేరడం వల్ల పల్లె,పట్టణం అనే తేడాలేకుండా భానుడి భగభగలు కొనసాగుతున్నాయి.

ఎండలకు తోడు బలంగా వడగాల్పులు భారీగా వీస్తున్నందున జనం భయాందోళనకు గురికావాల్సి వస్తోంది. ఆదిలాబాద్‌, ఉట్నూర్‌ ఏజెన్సీల్లో ఎండల ప్రభావం తీవ్రంగా ఉంది. సింగరేణి ప్రాంతంలో ఎండతో పాటు భరించలేని ఉక్కపోత ఉంది. ఉదయం ఎనిమిది గంటలతో ప్రారంభమవుతున్న ఉక్కపోత అర్ధరాత్రి వరకు కొనసాగుతోంది.

ఇవీ చూడండి: విదేశాల నుంచి తెలంగాణకు వచ్చేవారికి నూతన మార్గదర్శకాలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.