ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండలానికి చెందిన ప్రభుత్వ వైద్యులు నిరసనకు దిగారు. మద్యం మత్తులో వైద్యులను ఇబ్బందులకు గురి చేసిన అధికార పార్టీ నాయకులను వెంటనే అరెస్టు చేయాలంటూ డిమాండ్ చేశారు.
ఈ మేరకు జిల్లా ఇంఛార్జీ ఎస్పీని కలిసి మరోమారు విన్నవించారు. మద్యం మత్తులో వైద్యులను ఇబ్బందులకు గురిచేసిన నాయకులను వదిలిపెట్టద్దని కోరారు.
బోథ్ ఎంపీపీ, సర్పంచ్, ఎంపీవోలపై చర్యలు తీసుకోవాలి: ప్రభుత్వ వైద్యులు