అటవీ శాఖలో పనిచేస్తోన్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు తమను అకారణంగా తొలగించారంటూ ఆదిలాబాద్ పట్టణంలో నిరసన చేపట్టారు. అటవీ శాఖ కార్యాలయం నుంచి కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వ తీరును నిరసిస్తూ నినాదాలు చేశారు. తమను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ర్యాలీలో భాజపా జిల్లా అధ్యక్షుడు పాయల్ శంకర్ పాల్గొన్నారు.
ఇవీ చూడండి : తహసీల్దార్ కార్యాలయం ఎదుట వీఆర్వోల ధర్నా