మాజీ మంత్రి, ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న తన మనవడితో సరదాగా ఆటల్లో మునిగిపోయారు. ఉమ్మడి కుటుంబాల విశిష్టత తెలిపేలా 'ఫన్ విత్ ఫ్యామిలీ' పేరిట పట్టణంలోని ఓ ప్రైవేటు పాఠశాల వినూత్న కార్యక్రమం నిర్వహించింది. ఎప్పుడు సభలు, సమావేశాలతో తీరికలేకుండా గడిపే ఎమ్మెల్యే తన మనవడితో అరగంటకుపైగా ఆటలాడారు. ఉల్లాసం నింపేలా కార్యక్రమం నిర్వహించిన పాఠశాల యాజమాన్యాన్ని అభినందించారు.
- ఇదీ చూడండి : బేగంపేటలో గవర్నర్కు సీఎం ఘనంగా వీడ్కోలు..