ETV Bharat / state

రూ.5.50 లక్షల విలువైన నకిలీ పత్తి విత్తనాల స్వాధీనం

నియంత్రిత సాగు విధానంలో భాగంగా సీఎం కేసీఆర్​ పత్తి పంటకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వటం వల్ల రాష్ట్రంలో నకిలీ పత్తి విత్తనాల ముఠా రెచ్చిపోతుంది. ఇదే అదనుగా వ్యాపారులు ఏదోలా వాటిని రైతులకు అంటగట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఆదిలాబాద్​ జిల్లాలో రూ.5.50 లక్షల విలువైన 360 కేజీల నకిలీ విత్తనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

author img

By

Published : Jun 8, 2020, 5:12 PM IST

fake cotton seeds Seized in Adilabad district its worth Rs.5.50 lakhs rupees
రూ.5.50 లక్షల విలువైన నకిలీ పత్తి విత్తనాలు స్వాధీనం

ఆదిలాబాద్‌ పట్టణం రాంనగర్‌ కాలనీలో ప్రత్యేక టాస్క్​ఫోర్స్​ పోలీసులు తనిఖీలు చేయగా.. ఇళ్లలో నిల్వ చేసిన 750 పత్తి విత్తన ప్యాకెట్లను పట్టుకున్నారు. మొత్తం 5.50 లక్షల విలువైన 360కేజీల నకిలీ విత్తనాలను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ విష్ణు వారియర్ వెల్లడించారు. నిందితులను షేక్‌ మెహరాజ్‌, మహ్మద్‌ ముస్తాపాలను అరెస్టు చేసినట్లు తెలిపారు.

ఇటీవల మధ్యప్రదేశ్​కు చెందిన కాలుసింగ్ అనే వ్యక్తి నుంచి నకిలీ విత్తనాలను కొనుగోలు చేసినట్లు గుర్తించమన్నారు. రైతులు తక్కువ ధరకు విత్తనాలు అమ్మే వారిని నమ్మి మోసపోవద్దన్నారు. ఎవరైనా నకిలీ విత్తనాలు అమ్మితే కఠన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పీడీ కేసులు నమోదు చేసి జైలుకి పంపిస్తామన్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.