విద్యాశాఖలో అధికారుల బాధ్యాతారాహిత్యం ప్రతీ సారి వెల్లడవుతూనే ఉంది. ఇంటర్మీడియట్ బోర్డులో మార్కుల అవకతవకల ఘటన మరవకముందే... తాజాగా ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం దూరవిద్య కేంద్రం డిగ్రీ ధ్రువపత్రాలకు అర్హతలేవని తేల్చడం... సంబంధిత విద్యార్థులను.. ఆందోళనకు గురిచేస్తోంది. బీఈడీ ప్రవేశాలకు అర్హతసాధించి... దూరవిద్య పత్రాల కారణంగా ఉన్నత చదవులకు అధికారులు అడ్డు చెప్పడం వల్ల విద్యార్థుల భవిష్యత్తు అయోమయంలో పడింది. బీఈడీ చదివేందుకు పనికిరాని తమ డిగ్రీలు భవిష్యత్తులో మరే ఇతర ఉన్నత చదువులకు పనికిరావా..? అనే ప్రశ్న విద్యార్థుల నుంచి వ్యక్తమవుతోంది.
అధికారుల ద్వంద్వ వైఖరి
రాష్ట్రంలో ఓ పక్క 107 నాగార్జున దూరవిద్యకేంద్రాలను కొనసాగిస్తూనే... మరో పక్క అందులో అభ్యసిస్తున్న విద్యార్థులను ఉన్నత చదువులకు పరిగణలోకి తీసుకోకపోవడం అధికారుల ద్వంద్వవైఖరిని చాటిచెబుతోంది.
ఇదీ చూడండి: విద్యారంగ సమస్యలను పరిష్కరించాలి