ETV Bharat / state

వర్షపాతం నమోదులో తేడాలు... అయోమయంలో రైతులు - adhilabad news

ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలోని కొత్త మండలాల్లో వర్షపాతం లెక్కింపులో తేడాలుంటున్నాయి.అధికారులు రెండు రకాల లెక్కలు చూపుతుండటంతో ఏది సరైందో తెలియడం లేదు. పలు తహస్దీలార్‌ కార్యాలయాల్లో మ్యానువల్‌గా, కొన్ని మండలాల్లో సాంకేతికంగా వర్షపాతం లెక్కించడంతో వర్షపాతం నమోదులో తేడాలు వస్తున్నాయి.

differences in rainfall records in adilabad

author img

By

Published : Aug 26, 2020, 8:07 AM IST

కొత్త మండలాల్లో వర్షపాతం లెక్కింపులో తేడాలుంటున్నాయి. అధికారులు రెండు రకాల లెక్కలు చూపుతుండటంతో ఏది సరైందో తెలియడం లేదు. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలోని 52 పాత మండలాల్లోని తహసీల్దార్‌ కార్యాలయాల్లో వర్షమాణినులు(రెయిన్‌గేజ్‌లు) ఉన్నాయి. ఇప్పటి వరకు మండలాల వారీగా వర్షం ఎంత కురిసిందనేది ఆయా తహసీల్దార్‌ కార్యాలయాల నుంచి తీసుకొని నమోదు చేస్తున్నారు. జిల్లాల విభజన తరువాత నాలుగు జిల్లాల్లో మరో 18 మండలాలు కొత్తగా ఏర్పడ్డాయి. కొత్త మండలాల్లో వీటిని ఏర్పాటు చేయకపోవడంతో ఆయా మండలాల్లోని ఇతర ప్రాంతాల్లో తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి ప్రణాళిక సంస్థ (టీఎస్‌డీపీఎస్‌) ఏర్పాటు చేసిన సాంకేతిక వాతావరణ కేంద్రాల్లో నమోదయ్యే వర్షపాతం వివరాలను అధికారులు లెక్కలోకి తీసుకుంటున్నారు. తహస్దీలార్‌ కార్యాలయాల్లో మ్యానువల్‌గా, కొన్ని మండలాల్లో సాంకేతికంగా వర్షపాతం లెక్కించడంతో వర్షపాతం నమోదులో తేడాలు వస్తున్నాయి.

లెక్కిస్తున్నారు ఇలా..

వర్షపాతం లెక్కల్లో తేడాలు రావడంతో సీపీఓ కార్యాలయ సిబ్బంది సమీకృత వర్షపాతం లెక్కిస్తున్నారు. తాజాగా ఆటోమేటిక్‌ వెదర్‌ స్టేషన్ల నుంచి వచ్చిన వర్షపాతం, మ్యానువల్‌గా వచ్చిన వర్షపాతం రెండింటిని పరిగణనలోకి తీసుకుంటున్నారు. వాటిని వేరు, వేరుగా ప్రకటిస్తూనే.. రెండింటిలో నమోదు అయిన వర్షపాతం సగటును సమీకృత (ఇంటిగ్రేటెడ్‌) వర్షపాతంగా లెక్కించి అధికారులు వెల్లడిస్తున్నారు. పాత మండల కేంద్రాల్లో మ్యానువల్‌ వర్షమాణినులను ఏర్పాటు చేసింది. ఆయా మండల రెవెన్యూ శాఖ పరిధిలో ఇవి కొనసాగుతున్నాయి.. రోజు వారీగా మండలంలో కురిసే వర్షాన్ని మండల రెవెన్యూ సిబ్బంది లెక్కించి సీపీఓ కార్యాలయానికి పంపిస్తారు.

సాంకేతిక వాతావరణ కేంద్రాల్లో ఇలా..

రాష్ట్రం ఏర్పడిన తరువాత టీఎస్‌డీపీఎస్‌ ఆధ్వర్యంలో ఉమ్మడి జిల్లాల్లోని 18 మండలాలతో పాటు అదనంగా మరో 20 సాంకేతిక వాతావరణ నమోదు కేంద్రాలు ఏర్పాటు చేసింది. ఒక్కో కేంద్రం 3-5 కిమీల పరిధిలో కురిసే వర్షాన్ని లెక్కిస్తుంది. దాని సమీపంలో వర్షం కురిస్తే.. ఆ మండలం మొత్తంగా కురిసినట్లుగా పరిగణిస్తున్నారు.

● ఆదిలాబాద్‌ జిల్లాలో విస్తీర్ణం ఎక్కువగా ఉండే జైనథ్‌లో అదనంగా భోరజ్‌ ప్రాంతంలో గాదిగూడ మండలానికి చెందిన కేంద్రం లోకారిలో ఏర్పాటు చేశారు. బేలది మాంగురూడ్‌లో, ఇంద్రవెల్లి మండలానికి హీరాపూర్‌లో, బోథ్‌ది పొచ్చెరలో, భీంపూర్‌ మండలానిది అర్లిలో, తలమడుగు మండల కేంద్రంతో పాటు అదనంగా బరంపూర్‌లో సాంకేతిక వాతావరణ కేంద్రం(ఏడబ్ల్యూఎస్‌) ఏర్పాటు చేశారు. ఈ లెక్కన మండల కేంద్రాలతో పాటు, అదనంగా ఏర్పాటు చేసిన కేంద్రాల ద్వారా ఆయా మండలాల్లో కురిసే వర్షం మొత్తం లెక్కల్లోకి వస్తుంది.

● మంచిర్యాల జిల్లాలో ఏర్పాటు చేసిన కొత్త మండలాలతో పాటు జన్నారం, కన్నెపల్లి, జైపూర్‌, దండేపల్లి, హజీపూర్‌, చెన్నూర్‌, కోటపల్లి తదితర మండలాల్లో అదనంగా ఆటోమేటిక్‌ వెదర్‌ స్టేషన్లు ఏర్పాటు చేశారు.

● కుమురం భీం జిల్లాలో కొత్త మండలాలతో పాటు సిర్పూరు(యు), రెబ్బెన, కాగజ్‌నగర్‌, తిర్యాణి, తదితర మండలాల్లో అదనంగా సాంకేతిక పరికరాలతో కూడిన సూచికలు ఏర్పాట్లు చేశారు.

● నిర్మల్‌ జిల్లాలో 29 సాంకేతిక వాతావరణ కేంద్రాలు ఏర్పాటు చేశారు. కొత్త మండలాలతో పాటు మ్యానువల్‌ రేయిన్‌గేజ్‌లు ఉన్న ఖానాపూర్‌, ముథోల్‌, లక్ష్మణాచాంద, మామడ, సారంగపూర్‌ తదితర మండలాల్లోనూ ఏడబ్ల్యూఎస్‌లు ఏర్పాటు చేశారు.

కరవు సమయాల్లో రైతులకు నష్టం..

కరవు సమయాల్లో రైతులు నష్టపోయినపుడు వర్షపాతాన్ని లెక్కలోకి తీసుకుంటారు. ఒక నెలలో పడిన సగటును లెక్కించి దాని కంటే తక్కువ ఉంటే బీమా పరిహారం అందిస్తారు. ఈ లెక్కల్లో తేడాలుంటే రైతులు నష్టపోయే అవకాశం ఉంటుంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.