సీపీఎం నేత జూలకంటి రంగారెడ్డి నేతృత్వంలోని బృందం ఆదిలాబాద్‌లోని రిమ్స్ వైద్యకళాశాలను సందర్శించింది. వ్యాధిగ్రస్తులకు అందుతున్న వైద్యం, వైద్యపోస్టుల ఖాళీలను అడిగి తెలుసుకున్నారు. డెంగీపై హైకోర్టు ఆక్షేపించినా... ఓ మహిళా న్యాయమూర్తి మరణించినా... ప్రభుత్వంలో చలనం లేదని రంగారెడ్డి ఆరోపించారు. రాష్ట్రంలో డెంగీ మరణాలన్నీ ప్రభుత్వ హత్యలుగానే భావించాల్సి వస్తుందన్నారు. ప్రజలంటే ప్రగతి భవన్‌లో మరణించిన కుక్కకంటే హీనమా అని ప్రశ్నించారు.
ఇదీ చూడండి: పడిలేచిన 'మహా' కెరటం పవార్!