ETV Bharat / state

ఆదిలాబాద్​లో పత్తి రైతుల ఆందోళన ఉద్రిక్తం.. డీజిల్​ బాటిళ్లు చేతబట్టిన అన్నదాతలు

cotton farmers protest: ఆదిలాబాద్‌ వ్యవసాయ మార్కెట్‌యార్డులో వ్యాపారుల తీరును నిరసిస్తూ రైతులు ఆందోళనకు దిగారు. యార్డు ప్రధాన ద్వారాన్ని మూసి కొనుగోళ్లు జరగకుండా అడ్డుకున్నారు. కిసాన్‌చౌక్‌ సమీపంలోని జాతీయరహదారిపై దాదాపు ఐదు గంటల నుంచి ఆందోళన చేస్తున్నారు. ఒకేరోజు వ్యవధిలో క్వింటాలుకు రూ.170 ధర తగ్గించడం రైతుల ఆగ్రహానికి కారణమైంది. వారిని పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది.

ఆదిలాబాద్​లో పత్తి రైతుల ఆందోళన ఉద్రిక్తం.. డీజిల్​ బాటిళ్లు చేతబట్టిన అన్నదాతలు
ఆదిలాబాద్​లో పత్తి రైతుల ఆందోళన ఉద్రిక్తం.. డీజిల్​ బాటిళ్లు చేతబట్టిన అన్నదాతలు
author img

By

Published : Nov 27, 2021, 12:37 PM IST

Updated : Nov 27, 2021, 3:28 PM IST

ఆదిలాబాద్​లో పత్తి రైతుల ఆందోళన ఉద్రిక్తం.. డీజిల్​ బాటిళ్లు చేతబట్టిన అన్నదాతలు

cotton farmers protest: ఆదిలాబాద్‌ వ్యవసాయ మార్కెట్‌ యార్డులో వ్యాపారుల తీరు కొనుగోళ్ల ఆరంభం నుంచి వివాదానికి దారితీస్తోంది. తొలి రోజున క్వింటాలుకు రూ.7,920తో కొనుగోళ్లు ప్రారంభించిన వ్యాపారులు ఆ తర్వాత ఆధరను రూ.8,540 వరకు పెంచారు. ఆ తర్వాత తగ్గిస్తూ వస్తున్నారు. శుక్రవారం క్వింటాలుకు రూ.8130 ధర నిర్ణయించిన అధికారులు ఈరోజు ఆ ధరను రూ.7.960కి తగ్గించారు. క్వింటాలుకు రూ.170 తగ్గించడంతో భారీగా పత్తి వాహనాలతో తరలివచ్చిన రైతులు ఆందోళనకు దిగారు. మార్కెటింగ్‌ అధికారి శ్రీనివాస్‌ను చుట్టుముట్టి ఘెరావ్‌ చేశారు. వ్యాపారులు పత్తి బండ్లు చూసి ధర తగ్గించారని, బయట మార్కెట్‌లలో ధర క్వింటాలుకు రూ.8వేలు పైచిలుకు పలుకుతుండగా.. ఇక్కడ మాత్రం వ్యాపారులు తమను మోసం చేయాలని చూస్తున్నారని రైతులు మండిపడ్డారు. వ్యాపారుల లైసెన్సులు రద్దు చేసి తమకు అధిక ధరవచ్చేలా చూడాలని డిమాండ్‌ చేశారు.

డీజిల్ బాటిళ్లతో ధర్నా

యార్డు గేటును మూసిన రైతులు పట్టణంలోని కిసాన్‌చౌక్‌ సమీపంలోని జాతీయరహదారిపై దాదాపు ఐదుగంటల నుంచి ఆందోళన చేస్తున్నారు. జాతీయరహదారిపై ఎడ్ల బండ్లు ఉంచి నిరసన చేపట్టారు. ఈ క్రమంలో కొందరు రైతులు డీజిల్‌ బాటిళ్లను చేతపట్టుకుని ఆందోళనలో పాల్గొనడం... వారిని పోలీసులు అడ్డుకోవడం తోపులాటకు దారితీసింది.

అధికారులు రావాలని డిమాండ్

వన్‌టౌన్‌ సీఐ రామకృష్ణపై డీజిల్‌ పడటంతో పోలీసులు రైతులను వారించడంతో ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు, రైతుల తోపులాటతో ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. రైతులు పెద్దపెట్టున నినాదాలు చేయడంతో కిసాన్‌చౌక్‌ దద్దరిల్లింది. రైతులు గంటల తరబడి ఆందోళన చేయడంతో ట్రాఫిక్‌కు అంతరాయం కలిగి వాహనాలు ఎక్కడిక్కడ నిలిచిపోయాయి. ఇంత జరుగుతున్నా జిల్లా అధికారులు రైతుల ఆందోళన వద్దకు రాకపోవడం విమర్శలకు తావిచ్చింది. ధర పెంచేవరకు తమ ఆందోళన ఆపేదిలేదని రైతులు స్పష్టం చేశారు.

ఎట్ల బతకాలె..

క్వింటాలుకు రూ.8130 ధర ఉందంటే మేము ఇక్కడికి వచ్చినం. వచ్చిన బండ్లను చూసి వెంటనే దాదాపు 200 రూపాయలను ధరను తగ్గించారు. సరిగా 8వేలు కూడా ధరలేదు. పంట పండించడానికి ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నాం. మేము ఎట్లా బతకాలె. -సలీం, రైతు, ఆదిలాబాద్‌ జిల్లా

వాళ్ల ఇష్టమేనా?

రోజుకోసారి ధర పెంచుడు దించుడు వాళ్ల ఇష్టమేనా?. ఎనిమదిన్నర వేల ధరతో కొనుగోలు చేయాలి. వ్యాపారుల లైసెన్సులు రద్దు చేసి తమకు అధిక ధరవచ్చేలా చూడాలి. -మల్లన్న, రైతు, ఆదిలాబాద్‌ జిల్లా

అకాల వర్షాలతో అనర్థం

వర్షాదారాధారితమైన ఆదిలాబాద్‌ జిల్లాలో సాగు విస్తీర్ణంలో పత్తి ప్రధాన పంటగా నిలుస్తోంది. సహజంగానైతే ఎకరాకు సగటున పది క్వింటాళ్ల దిగుబడి వచ్చేది. కానీ ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా పత్తి పంటకు తీవ్ర నష్టం వాటిల్లింది. పూతా, కాతారాలిపోయి దిగుబడి సగానికి సగం పడిపోయింది. కొన్ని ప్రాంతాల్లోనైతే ఎకరాకు 5 క్వింటాళ్లు కూడా వచ్చే పరిస్థితి లేదు. అంతర్జాతీయ మార్కెట్లో పత్తి బేళ్లకు... డిమాండ్‌ కారణంగా క్వింటా ధర రూ.8వేలకు పైగా పలుకుతున్నప్పటికీ... వ్యాపారులు కుమ్మక్కై ధరను తగ్గిస్తున్నారు. ఈ నేపథ్యంలో రైతులు ఆందోళనలు చేపట్టాల్సి వస్తోంది. దిగుబడి లేక... దిగాలుగా ఉంటే... నాణ్యత, తేమ పేరిట వ్యాపారులు ధరలో కోత విధిస్తుండటం... రైతులను మరింత ఆందోళనకు గురిచేస్తోంది.

ఇదీ చదవండి:

Cotton support price: పత్తి ధర బాగున్నా రైతుకు సున్నా.. దిగుబడి లేక ఆవేదన..

Sandhya Kranti: సంధ్యాక్రాంతి.. ప్రపంచానికే పత్తి పాఠాలు..!

Cotton Cultivation : 'సమూల మార్పులతోనే.. పత్తి సాగు లాభసాటి'

Central govt about TS paddy procurement: తెలంగాణలో ధాన్యం కొంటాం: కేంద్రం

Last Updated : Nov 27, 2021, 3:28 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.