ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండల కేంద్రంలోని హనుమాన్‌నగర్‌కు చెందిన ఓ బాలింత మహిళకు కరోనా పాజిటివ్ వచ్చినట్లు అదనపు జిల్లా వైద్యాధికారి తెలిపారు. ఈ నెల 13న ఆమెకు శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా ఉండటం వల్ల హైదరాబాద్‌లోని గాంధీ ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు.
అక్కడ వైద్యులు వైద్య పరీక్షలు నిర్వహించి... ఆమెకు కరోనా పాజిటివ్ ఉందని నిర్ధరించినట్లు వెల్లడించారు. వెంటనే వైద్య సిబ్బంది రోగి ఇంటి వద్దకు చేరుకొని సర్వే ప్రారంభించినట్లు వైద్యురాలు డాక్టర్ అనురాధ తెలిపారు.