ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండల కేంద్రంలోని పలు కాలనీల్లో కరోనా వైరస్‌పై మండల స్థాయి అధికారులు ముందస్తు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఇంటింటికి తిరిగి పరిశుభ్రత పాటించాలని సూచించారు. కరోనా లక్షణాలు ఉంటే వెంటనే తెలియజేయాలన్నారు.
చేతులు శుభ్రంగా కడుక్కోవాలని అధికారులు సూచించారు. హోటళ్లు, దుకాణాల్లోనూ అవగాహన కల్పించారు. కార్యక్రమంలో తహసీల్దార్ అతికొద్దిన్, ఎంపీపీ ప్రీతమ్ రెడ్డి, డిప్యూటీ తహసీల్దార్ జాదవ్ రామారావు తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి: కరోనా నుంచి కోలుకొని గుండెపోటుతో వ్యక్తి మృతి