ETV Bharat / state

Congress Protest Against BRS : 'రాష్ట్రంలో ఎక్కడైనా 24 గంటల కరెంట్‌ ఇచ్చినట్లు నిరూపిస్తే.. దేనికైనా సిద్ధం'

Congress fires on BRS : రైతుల పట్ల ప్రభుత్వం అనుసరించే వైఖరిని నిరసిస్తూ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సబ్‌స్టేషన్ల ముట్టడికి హస్తం పార్టీ పిలుపునిచ్చింది. విద్యుత్‌ ఉద్యోగులకు జీతాలు చెల్లించలేని స్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉందని ఆ పార్టీ నాయకులు విమర్శించారు. రాష్ట్రంలో ఎక్కడైనా 24 గంటల కరెంట్‌ ఇచ్చినట్లు నిరూపిస్తే దేనికైనా సిద్ధమని అన్నారు. బీఆర్​ఎస్ నేతలు చేస్తున్న ఆందోళనలను ఖండించారు. మరోవైపు రాహుల్‌పై అనర్హత వేటు, అనంతర పరిణామాలకు నిరసనగా కాంగ్రెస్​ శ్రేణులు గాంధీభవన్​లో సత్యాగ్రహ మౌన దీక్ష చేపట్టారు.

Congress
Congress
author img

By

Published : Jul 12, 2023, 1:56 PM IST

Congress Protest Against BRS Comments : రాష్ట్రంలో ఉచిత విద్యుత్‌పై బీఆర్ఎస్-కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధంతో రాజకీయ వేడి రగులుకుంది. విద్యుత్‌పై పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి వాఖ్యలను... బీఆర్​ఎస్ నేతలు వక్రీకరించారంటూ జిల్లాల్లో కాంగ్రెస్‌ శ్రేణులు ఆందోళనకు దిగాయి. రాష్ట్రంలో ఎక్కడా 24 గంటలు... వ్యవసాయానికి ఉచిత్‌ విద్యుత్‌ సరఫరా లేదంటూ పార్టీ శ్రేణులు ఎదురుదాడికి దిగాయి.

Free Current Controversy in Telangana : పీసీసీ పిలుపు మేరకు ఆదిలాబాద్‌ పట్టణంలోని విద్యుత్తు ఎస్​ఈ కార్యాలయం ఎదుట కాంగ్రెస్ శ్రేణులు నిరసనకు దిగాయి. సీఎం కేసీఆర్‌ ప్లెక్సీని... దహనం చేసేందుకు యత్నించారు. కాంగ్రెస్‌ నేతలను పోలీసులు అడ్డుకోగా.... ఇరువర్గాల మధ్యతోపులాట చోటు చేసుకుంది. హనుమకొండ జిల్లా ఆత్మకూరులో కాంగ్రెస్ శ్రేణులు ఆందోళనకు దిగారు. నాణ్యమైన విద్యుత్‌ 8 గంటలు ఇస్తే సరిపోతుందని రేవంత్‌ అన్నారే తప్ప... 24 గంటల ఉచిత విద్యుత్​కి వ్యతిరేకం కాదని పేర్కొన్నారు. ఓటమి భయంతోనే బీఆర్​ఎస్ ధర్నాలకు దిగుతోందని విమర్శించారు.

ఉచిత కరెంటును తీసుకువచ్చిందే కాంగ్రెస్‌ : నిజామాబాద్‌ జిల్లా సాలూరలో.... హస్తం పార్టీ శ్రేణులు ఆందోళన నిర్వహించాయి. 24 గంటల కరెంట్‌ అంటూ బీఆర్​ఎస్ సర్కారు ప్రజలు మోసం చేస్తోందని విమర్శించారు. రైతులకి ప్రభుత్వం చేస్తున్న మోసాలను ప్రజలు తెలుసుకున్నందువల్లే బీఆర్​ఎస్ నేతలు రోడ్లపైకి వచ్చి ధర్నాలు చేస్తున్నారని ఆరోపించారు. ఉచిత కరెంటును తీసుకువచ్చిందే కాంగ్రెస్‌ ప్రభుత్వమని... ప్రజల్లో తమ పార్టీకి పెరిగిన ఆదరణను బీఆర్​ఎస్ భరించలేక ఇలాంటి దుష్ప్రచారం చేస్తున్నారని కాంగ్రెస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులకు ఇచ్చిన హామీలను మరిచిన బీఆర్​ఎస్ సర్కార్‌... ప్రజలను పక్కదోవ పట్టించేందుకు యత్నిస్తోందన్నారు.

పోటాపోటీ నిరసనలు... భారీగా పోలీసుల మోహరింపు : సిద్దిపేట జిల్లా గజ్వేల్‌లో బీఆర్​ఎస్, కాంగ్రెస్ పోటాపోటీ నిరసనలకు దిగాయి. ఒకవైపు ఉచిత విద్యుత్‌పై రేవంత్‌ వ్యాఖ్యలకు నిరసనగా బీఆర్​ఎస్ ఆందోళన చేపట్టగా.. మరోవైపు సత్యాగ్రహ దీక్షలో భాగంగా కాంగ్రెస్ శ్రేణులు నిరసనకు దిగారు. ఈ క్రమంలో రెండు పార్టీలు ఒకేచోట కార్యక్రమం చేపట్టడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. రెండు పార్టీల కార్యకర్తలు పోటాపోటీ నినాదాలు చేసుకున్నారు. ఎలాంటి గొడవలు చోటుచేసుకోకుండా గజ్వేల్‌లో పోలీసులు భారీగా మోహరించారు.

మరోవైపు కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీపై మోదీ సర్కారు రాజకీయంగా కక్షకట్టిందని ఆ పార్టీ నేతలు ఆందోళన నిర్వహిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ తీరును నిరసిస్తూ దేశంలోని ప్రధాన నగరాల్లో హస్తం పార్టీ శ్రేణుల ధర్నా చేపట్టారు. అందులో భాగంగా పీసీసీ అధ్యర్యంలో గాంధీ భవన్‌లో సత్యాగ్రహ మౌనదీక్ష నిర్వహిస్తున్నారు. ఆ కార్యక్రమానికి కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి, మహేశ్ కుమార్ గౌడ్, పొన్నాల లక్ష్మయ్య, మల్లు రవి, పొన్నం ప్రభాకర్, సిరిసిల్ల రాజయ్య, కోదండరెడ్డి సహా పలువురు సీనియర్‌ నేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన కాంగ్రెస్ నాయకులు బీఆర్​ఎస్, బీజేపీలపై తీవ్ర ఆరోపణలు గుప్పించారు.

ఇవీ చదవండి :

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.