ETV Bharat / state

ఆదిలాబాద్​లో ‘మనకోసం మనం’ కార్యక్రమం - ఆదిలాబాద్​ పురపాలక సంఘం

ఆదిలాబాద్​ మున్సిపాలిటీ ఆధ్వర్యంలో పట్టణంలో మనకోసం మనం కార్యక్రమాన్ని నిర్వహంచారు. కమిషనర్​ మారుతి ప్రసాద్​, మున్సిపల్​ ఛైర్మన్​​ జోగు ప్రేమేందర్​ ఆధ్వర్యంలో పట్టణంలోని పలు ప్రాంతాల్లో పరిసరాల పరిశుభ్రతపై ప్రజలకు అవగాహన కల్పించారు.

Adilabad Municipality Conduct Manakosam manam Program
ఆదిలాబాద్​లో ‘మనకోసం మనం’ కార్యక్రమం
author img

By

Published : Jul 5, 2020, 7:37 PM IST

ఆదిలాబాద్​ పట్టణంలో మున్సిపాలిటీ శాఖ ఆధ్వర్యంలో పరిసరాల పరిశుభ్రతపై ప్రజలకు అవగాహన కల్పించారు. మనకోసం మనం అనే కార్యక్రమం ద్వారా పట్టణంలోని బ్రాహ్మణవాడలో కమిషనర్​ మారుతి ప్రసాద్​, సరస్వతి నగర్​లో మున్సిపల్​ ఛైర్మన్​ జోగు ప్రేమేందర్​ పరిసరాల పరిశుభ్రత, ఆరోగ్యం, సీజనల్​ వ్యాధుల వ్యాప్తి గురించి అవగాహన కల్పించారు.

కాలనీల్లో నిల్వ ఉన్న నీటిని తొలిగించారు. తడిచెత్త, పొడి చెత్త వేర్వేరుగా వేయాలని ప్రచారం చేస్తూ..ఇంటింటికీ బుట్టలు అందజేశారు. వారానికి ఒకసారి పరిసరాలను తప్పకుండా శుభ్రం చేసుకోవాలని, లేని పక్షంలో క్రిములు పెరిగి.. వ్యాధులు సంక్రమిస్తాయని కమిషనర్​ తెలిపారు.

ఇదీ చూడండి: విదేశీ యాప్​లకు ప్రత్యామ్నాయంగా 'ఎలిమెంట్స్'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.