ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు మండల కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఆకస్మికంగా సందర్శించారు. ఐటీడీఏ, సంబంధిత శాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు.
మండల కేంద్రంలోని కుమురం భీం ప్రాంగణంలోని సబ్బుల తయారీ, పల్లీ పట్టీల కేంద్రాలను పరిశీలించారు. అనంతరం ఆయా కేంద్రాల్లో పనిచేస్తున్న వారితో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు.
నవంబర్ 2 వ తేదీన గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాఠోడ్ రానున్నారని కలెక్టర్ పేర్కొన్నారు. కేంద్రాలను ప్రారంభించేందుకు ఆ రోజు అన్నీ సిద్ధంగా ఉంచాలని అధికారులకు సూచించారు.
ఇదీ చదవండి: ఓపెన్ స్కూలు విద్యార్థులు కౌన్సెలింగ్కు హాజరయ్యేలా ఉత్తర్వులు