అయోధ్య రామ మందిర నిర్మాణానికి ఆదిలాబాద్ జిల్లా కేెంద్రానికి చెందిన ప్రముఖ వ్యాపారి భజరంగ్లాల్ అగర్వాల్ లక్ష రూపాయల విరాళాన్ని అందించారు. ఈ మేరకు చెక్కును రామచంద్ర గోపాలకృష్ణమఠాధిపతి యోగానంద సరస్వతికి అందించారు.
హిందువులందరూ అయోధ్య రామ మందిర నిర్మాణానికి విరాళాలు ఇవ్వాలని అగర్వాల్ పిలుపునిచ్చారు. ఇందుకు సంబంధించిన ప్రచార కరపత్రాలను యోగానంద సరస్వతితో కలిసి ఆయన విడుదల చేశారు.
ఇదీ చదవండి: బంగారు తొడుగులు.. వెండి ద్వారాలు