ETV Bharat / state

Adilabad Airport Delay : ఆదిలాబాద్​లో ఎయిర్‌పోర్టు వస్తుందా.. రాదా..?

Delay in Airport at Adilabad : ఆదిలాబాద్‌ కేంద్రంగా కొత్త విమానశ్రయం వస్తుందా..? రాదా..? అనేది సందిగ్ధంగానే కనిపిస్తోంది. ఓసారి ఎయిర్‌పోర్టు అని, మరోసారి ఎయిర్‌స్ట్రిప్‌ అని ఊరించడమే తప్ప.. ఆచరణలో ఎలాంటి కదలిక కనిపించడం లేదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పరస్పర విమర్శలకు కేంద్ర బిందువుగా నిలుస్తున్న ఆదిలాబాద్‌ విమనాశ్రయ కథపై ఈటీవీ భారత్ ప్రత్యేక కథనం.

Airport
Airport
author img

By

Published : Jul 19, 2023, 8:03 AM IST

ఏళ్లు గడుస్తున్న కొలిక్కిరాని ఆదిలాబాద్‌ విమానాశ్రయ ఏర్పాటు

Delay in Airport Establishment Adilabad District : ఆదిలాబాద్‌లో నిజాం కాలంలో విమానాల రాకపోకలకు అనుకూలంగా ఉండేది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ అవతరణ తర్వాత ప్రాధాన్యత తగ్గిపోయింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక మరోసారి తెరమీదకు రావడంతో మళ్లీ ప్రాధాన్యత సంతరించుకుంది. కానీ తరువాత ఎటూ తేలడంలేదు. ఆదిలాబాద్‌ మున్సిపాలిటీ పరిధిలోని ఖానాపూర్‌ కాలనీని ఆనుకుని 362 ఎకరాలతో వాయుసేన ఆధ్వర్యంలో ఉన్న విమానాశ్రయం.. నిజాం కాలంలో సైన్యం రాకపోకలు, ఇంధన తరలింపునకు కేంద్రంగా ఉండేది.

"కేంద్రప్రభుత్వానికి సంబంధించిన అధికారులు విమానాశ్రయ ఏర్పాట్ల కోసం పరిశీలించారు. విద్యుత్, నీరు, భూముల వివరాలను నమోదు చేసుకున్నారు. దీనికి సంబంధించి అధికారులు రిపోర్ట్ రాసుకున్నారు. ఇక వారి నుంచే ప్రక్రియకు సంబంధించిన వివరాలు రావాలి." - జగన్మోహన్‌, ఆదిలాబాద్‌ పూర్వ కలెక్టర్‌

Delay in Airport at Adilabad : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో విమానాల రాకపోకలకు వేర్వేరు కేంద్రాలు అందుబాటులోకి వచ్చాయి. అడవులు, వామపక్ష తీవ్రవాదం బలంగా ఉందనే కారణంతో.. ఆదిలాబాద్‌ ఎయిర్‌పోర్టు ప్రాధాన్యత తగ్గించడం అవరోధంగా మారింది. ఐదేళ్ల కిందట కొత్త విమానాశ్రాయాలకు కేంద్రం పచ్చజెండా ఊపడంతో.. ఆదిలాబాద్‌ పేరు మళ్లీ తెరపైకి వచ్చింది. విమానాశ్రయానికైతే 1592 ఎకరాల భూమి అవసరమని తేల్చడంతో.. ఆదిలాబాద్‌ మండలం పరిధిలోని కచికంటి, ఖానాపూర్‌, అనుకుంట, తంతోలి పరిధిలో భూమిని రెవెన్యూశాఖ గుర్తించింది. సమగ్ర వివరాలతో కూడిన నివేదికను తయారు చేసింది.

Delay in Airport Establishment Adilabad District : 2018 ఎన్నికల సమయంలో ఆదిలాబాద్‌ కేంద్రంగా ఎయిర్‌స్ట్రిప్ ఏర్పాటు చేస్తామని.. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రకటించడం ఆశలనుచిగురింప చేసినా.. పనులు మాత్రం ముందుకు కదలలేదు. మరోనాలుగైదు నెలల్లో శాసనసభ ఎన్నికల సమయం సమీపిస్తున్నప్పటికి.. ఎయిర్‌స్ట్రిప్‌, ఎయిర్‌పోర్ట్ అనేది తేలకపోవడం... స్థానికుల ఆశలపై నీళ్లు చల్లినట్లైంది.

"కేంద్రరాష్ట్ర ప్రభుత్వాల మొండివైఖరివల్ల ఇది ఆలస్యమవుతుంది. ఎయిర్‌పోర్టు కానీ ఎయిర్‌స్ట్రిప్‌ ఇక్కడ ఏర్పాటు అయితే ఆదిలాబాద్ జిల్లాకు విద్య, ఉపాధి, వైద్యపరంగా బాగుంటుంది. మేము విమానంలో రాకపోకలు సాగించాలంటే నాగ్‌పూర్‌ కానీ హైదరాబాద్ వెళ్లాల్సి వస్తుంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఏర్పాట్లపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం." - వెంకటేశ్‌, ఆదిలాబాద్‌

విమానయాన సంస్థ చేసిన సర్వేల్లోనూ.. విమానాల రాకపోకలకు ఆదిలాబాద్‌ అనుకూలంగానే ఉందనే విషయం తేలింది. ఎయిర్‌స్ట్రిప్ట్‌కైతే అదనంగా భూసేకరణ కూడా అవసరం లేదనే అభిప్రాయం అధికారుల్లో వ్యక్తమవుతోంది. భూముల పరిహారం, రైతులకు ప్రత్యామ్నాయం అంశాలకు ప్రాధాన్యత ఇస్తే ఎయిర్‌పోర్టు ఏర్పాటులో వచ్చే అవకాశం ఉందనే వాదన వినిపిస్తోంది.

"ఆదిలాబాద్‌లో ఎయిర్‌స్ట్రిప్ కోసం ప్రతిపాదనలు పంపించాం. ఎయిర్‌పోర్టు అథారిటీ డీజీసీఏ అధికారులు వారు సర్వేచేశారు. వారికి కావల్సిన సాంకేతిక విషయాలను అందించాం. మనకు హైదరాబాద్‌ కానీ, నాగపూర్‌ దూరంగా ఉందని వారు పేర్కొన్నారు. కానీ వారి నుంచే ప్రకియకు సంబంధించిన వివరాలు రావాలి." - సురేశ్‌ రాఠోడ్‌, ఆర్‌అండ్‌బీ డీఈ, ఆదిలాబాద్‌

ఇవీ చదవండి: Hyderabad Airport is Most Punctual : సమయపాలనలో నంబర్ వన్ 'శంషాబాద్ ఎయిర్​పోర్టు'

'మూడోసారి అధికారంలోకి వస్తే.. ప్రపంచంలోనే మూడో ఆర్థిక శక్తిగా భారత్'​.. NDA సమావేశంలో మోదీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.