టోక్యో ఒలింపిక్స్లో నాలుగో రోజు భారత అథ్లెట్లు నిరాశపరిచారు. ఆర్చరీ, బాక్సింగ్, స్విమ్మింగ్, ఫెన్సింగ్, టెన్నిస్లో విఫలమయ్యారు. టేబుల్ టెన్నిస్లో ఒక్క ఆచంట శరత్ కమల్ మాత్రమే ఫర్వాలేదనిపించాడు. ఈ నేపథ్యంలో మంగళవారం భారత అథ్లెట్లు ఏయే క్రీడలలో పోటీ పడుతున్నారనేది మీకోసం..
మంగళవారం షెడ్యూల్ ఇదే..
ఉదయం 05.30
- ఈవెంట్: షూటింగ్ (10మీ. ఎయిర్ పిస్టల్ మిక్స్డ్ టీమ్ క్వాలిఫికేషన్)
- అథ్లెట్లు: సౌరభ్ చౌదరి / మను బాకర్ - యశస్విని దేశ్వాల్ / అభిషేక్ వర్మ
ఉదయం 06.30
- ఈవెంట్: హాకీ (పురుషుల పూల్-ఏ మ్యాచ్)
- జట్లు: ఇండియా X స్పెయిన్
ఉదయం 08.30
- ఈవెంట్: బ్యాడ్మింటన్ (పురుషుల డబుల్స్ గ్రూప్-ఏ మ్యాచ్)
- అథ్లెట్లు: సాత్విక్ రాజ్ రాంకీ రెడ్డి / చిరాగ్ శెట్టి (ఇండియా) X బెన్ లేన్ / సీన్ వెండీ (గ్రేట్ బ్రిటన్)
- ఈవెంట్: టేబుల్ టెన్నిస్ (పురుషుల సింగిల్స్ రౌండ్ 3 మ్యాచ్)
- అథ్లెట్లు: ఆచంట శరత్ కమల్ (ఇండియా) X మా లోంగ్ (చైనా)
ఇదీ చదవండి: Tokyo Olympics: ఒలింపిక్స్లో అద్భుతం.. 13ఏళ్లకే పసిడి
ఉదయం 08.35
- ఈవెంట్: సెయిలింగ్ (మహిళల లేసర్ రేడియల్ రేస్)
- అథ్లెట్: నేత్ర కుమనన్
ఉదయం 08.45
- ఈవెంట్: సెయిలింగ్ (పురుషుల లేసర్ రేస్)
- అథ్లెట్: విష్ణు సరవనన్
ఉదయం 10.45
- ఈవెంట్: షూటింగ్ (10మీ. ఎయిర్ రైఫిల్ మిక్స్డ్ టీమ్ క్వాలిఫికేషన్)
- అథ్లెట్లు: ఎలావెనిల్ వలరివన్ / దివ్యాన్ష్ సింగ్ పన్వార్ - అంజుమ్ మౌద్గిల్ / దీపక్ కుమార్
ఉదయం 11.30
- ఈవెంట్: బాక్సింగ్ (మహిళల 69 కేజీల 16వ బౌట్ రౌండ్)
- అథ్లెట్లు: లవ్లీనా బోర్గోహైన్ (ఇండియా) X నదైన్ అపెట్జ్ (జర్మనీ)
ఉదయం 11.50
- ఈవెంట్: సెయిలింగ్ (పురుషుల స్కిఫ్ 49 ఈఆర్ రేస్)
- అథ్లెట్: కేసీ గణపతి - వరుణ్ ఠక్కర్
ఇదీ చదవండి: స్వదేశానికి మీరాబాయి.. ఏఎస్పీగా ఉద్యోగం