ETV Bharat / sports

Tokyo Olympics: క్రీడాకారులకు గోపీచంద్​ అభినందనలు - టోక్యో ఒలింపిక్స్​ క్రీడాకారులకు గోపీచంద్​ శుభాకాంక్షలు

టోక్యో ఒలింపిక్స్​లో పాల్గొంటున్న క్రీడాకారులకు బ్యాడ్మింటన్​ కోచ్​ పుల్లెల గోపీచంద్​ శుభాకాంక్షలు తెలిపారు. మునుపటి ఒలింపిక్స్​తో పోల్చితే ఇవి ప్రత్యేకమని ఈటీవీ భారత్​కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు.

pullela gopichand
పుల్లెల గోపీచంద్​
author img

By

Published : Jul 23, 2021, 9:03 PM IST

ప్రపంచ క్రీడామహోత్సవం ఒలింపిక్స్​లో పాల్గొంటున్న క్రీడాకారులకు ప్రముఖ బ్యాడ్మింటన్ కోచ్​ పుల్లెల గోపీచంద్​ అభినందనలు తెలిపారు. ఈ క్రీడలను కేవలం గెలుపోటములు, పోటీతత్వం కోణంలోనే చూడకుండా.. ఒక గొప్ప వేడుకగా భావించాలని ఈటీవీ భారత్​కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూ వేదికగా పిలుపునిచ్చారు. ప్రస్తుతం కరోనా కారణంగా కొన్ని ఈవెంట్స్​ లేకపోవడం బాధకరమని పేర్కొన్నారు. గతంలో వాటి కంటే ఈ క్రీడా వేడుకలు మరింత ప్రత్యేకమని వివరించారు. కరోనా ప్రోటోకాల్స్​ మధ్య జరుగుతుండటం వల్ల క్రీడాకారులపై ఒత్తిడి ఉంటుందని అభిప్రాయపడ్డారు.

టోక్యో క్రీడాకారులకు పుల్లెల అభినందనలు

భారత్​ నుంచి వెళ్లిన క్రీడాకారులు ఒత్తిడిని జయించే విధంగా ప్రముఖ యోగా సంస్థ 'ధ్యాన' కలిసి పని చేస్తుందని గోపీచంద్​ తెలిపారు. టోక్యో ఒలింపిక్స్​కు ధ్యానాను అధికారిక భాగస్వామిగా చేర్చినందుకు ఇండియన్​ ఒలింపిక్​ అసోషియేషన్​కు ధన్యవాదాలు తెలిపారు. ధ్యానా యాప్​ ద్వారా క్రీడాకారులు వారి ఒత్తిడిని, శ్వాస సంబంధిత సమస్యలను పరిష్కరించుకోవ్చని తెలిపిన ఆయన.. కరోనా సమయంలో వారికి ఇది ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు.

ఇదీ చూడండి: Tokyo Olympics: అట్టహాసంగా ఆరంభోత్సవం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.