ఒలింపిక్స్‌లో పాల్గొనాలనేది అథ్లెట్ల కల. ఈ మహాక్రీడల్లో గెలిచి పతకం సాధించే క్రీడాకారులు తమ పేరునే కాదు.. వారి దేశ ప్రతిష్ఠను ప్రపంచానికి చాటినవారవుతారు. అందుకే, అథ్లెట్లు పతకాలు గెలిస్తే దేశ ప్రభుత్వాలు ప్రోత్సాహకంగా నగదు బహుమతులు అందజేస్తుంటాయి. ఈసారి కూడా ఒలింపిక్స్‌లో పతకాలు తెచ్చేవారికి ప్రభుత్వాలు నజరానా ప్రకటించాయి. మరి ఏ దేశం.. ఏ పతకానికి ఎంత నగదు బహుమతి ప్రకటించిందో ఓ లుక్కేద్దాం..
బ్రిటన్, నార్వే, స్వీడన్ దేశాలు మాత్రం అథ్లెట్లకు నగదు ప్రోత్సాహకాలు ఇవ్వట్లేదు. దానికి బదులుగా ఒలింపిక్స్, పారాఒలింపిక్స్ క్రీడల కోసం ఏటా 160 మిలియన్ డాలర్లు కేటాయిస్తున్నాయి. ఈ డబ్బుతో అథ్లెట్లకు శిక్షణ, స్టైఫండ్ ఇస్తున్నారు. నగదు ప్రోత్సాహకాలు ఇవ్వడం వల్ల అథ్లెట్లలో క్రీడా స్ఫూర్తి రాదని బ్రిటన్ నమ్మకం. అందుకే నజరానా ఇవ్వడానికి విముఖుత చూపుతోంది.
ఇదీ చదవండి: Olympics: అమ్మాయిలూ.. నీది నాది ఒకే కథ!