ETV Bharat / sports

ఒలింపిక్స్​ ప్రదర్శనతో షూటింగ్ సమాఖ్య షాక్​ - ISSF Worldcup 2021

షూటింగ్​ ప్రపంచకప్​లో అసాధారణ ప్రదర్శన చేసిన షూటర్లు.. ఒలింపిక్స్​లో దాన్ని కొనసాగించకపోవడం వెనక ఏదో లోపం ఉందని భారత రైఫెల్​ సమాఖ్య అధ్యక్షుడు రణీందర్​ సింగ్​ అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా కోచింగ్​, సహాయక సిబ్బంది మార్పు గురించి తాను చర్చించినట్లు తెలిపారు. భారత షూటర్లు భవిష్యత్​లో కచ్చితంగా రాణిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.

Indian debacle in Tokyo shocks shooting fraternity, NRAI boss talks of 'overhaul'
ఒలింపిక్స్​ ప్రదర్శనతో షూటింగ్ సమాఖ్య షాక్​
author img

By

Published : Jul 27, 2021, 3:49 PM IST

ఎన్నో ఆశలు పెట్టుకున్న షూటింగ్​ విభాగం ఒలింపిక్స్​లో విఫలమవ్వడంపై భారత షూటింగ్​ సమాఖ్య మంగళవారం ఓ ప్రకటన చేసింది. దేశం​ తరఫున ఒలింపిక్స్​లో పాల్గొన్న తమ 15 షూటింగ్​ బృందాలపై మరింత దృష్టిసారించి.. సరైన మార్గంలోకి తెస్తామని భారత షూటింగ్​ సమాఖ్య వెల్లడించింది. కోచింగ్​, సహాయక సిబ్బంది విషయాల్లో మార్పులు జరుగుతాయని ఈ సందర్భంగా హామీ ఇచ్చింది.

"కచ్చితంగా.. మా అంచనాలకు తగ్గ ప్రదర్శన చేయలేకపోయారు. కోచింగ్​, సహాయక సిబ్బంది సమగ్ర మార్పు గురించిన నేను మాట్లాడాను. ఒలింపిక్స్​ లాంటి పెద్ద ఈవెంట్లలో మన షూటర్లను సిద్ధం చేయడంలో ఏదో లోపం ఉందని నేను భావిస్తున్నా. ఎందుకంటే వారి ప్రతిభ ఎంటో ప్రపంచకప్​ ఈవెంట్​లో చూశాం. కానీ, ఇప్పుడు అందుకు పూర్తి భిన్నంగా ఉంది. రియో ఒలింపిక్స్​లో భారత షూటర్లు ఘోరమైన వైఫల్యం తర్వాత.. ఒలింపిక్​ ఛాంపియన్​ అభినవ్​ బింద్రా నేతృత్వంలో ప్యానెల్​ ఏర్పాటుచేసి సిఫారసులు అమలు చేయడం సహా.. క్రీడాకారులకు అవసరాలను తీర్చేందుకు ఫెడరేషన్​ సహా ఇతర వాటాదారులు ఎంతో కృషి చేశారు. ఇప్పుడు ఒలింపిక్స్​ ప్రదర్శనల చర్చ గురించి కాకుండా అథ్లెట్లకు మద్దతు ఇవ్వడం ముఖ్యం. భవిష్యత్​లో కచ్చితమైన ఫలితాలు వస్తాయని ఆశిస్తున్నాం".

- రణీందర్​ సింగ్​, నేషనల్​ రైఫెల్​ అసోసియేషన్​ అధ్యక్షుడు

టోక్యో ఒలింపిక్స్‌లో ఇంతకాలం భారత్ ఆశలన్నీ షూటింగ్​పైనే ఉండేవి. కానీ ఐదో రోజు.. షూటింగ్‌ 10మీటర్ల ఎయిర్‌ రైఫిల్‌ మిక్స్‌డ్‌ విభాగంలోనూ నిరాశ తప్పలేదు. భారత్ తరఫున మంగళవారం బరిలో నిలిచిన వలరివన్‌- దివ్యాన్ష్‌, అంజుమ్‌- దీపక్‌లు లక్ష్యానికి గురి పెట్టడంలో విఫలమై.. ఫైనల్‌కు అర్హత సాధించలేకపోయారు. మరోవైపు భారత్ స్టార్ జోడీ వలరివన్-దివ్యాన్ష్‌లు 12 స్థానంలో నిలవగా.. మరో జంట అంజుమ్‌, దీపక్‌లు తీవ్రంగా నిరాశ పరుస్తూ 18వ స్థానానికి పరిమితమయ్యారు. టాప్‌లో నిలిచిన మొదటి 8 జట్లకు మాత్రమే తదుపరి దశకు అర్హత ఉండటం వల్ల.. భారత క్రీడాకారులు వెనుదిరగక తప్పలేదు.

ఇదీ చూడండి.. Tokyo Olympics: అమ్మాయిలపై ఆ దృష్టి ఉండకూడదని..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.