టోక్యో పారాలింపిక్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం దక్కింది. భారత అథ్లెట్ సుమిత్(Sumith Javelin Throw).. జావెలిన్ త్రోలో చరిత్ర సృష్టించాడు. ఎఫ్ 64 విభాగంలో 68.55 మీటర్ల దూరం విసిరి గోల్డ్ మెడల్‌ను కైవసం చేసుకున్నాడు.
తొలి రౌండ్లోనే 66.95 మీటర్ల దూరం విసిరి ప్రపంచ రికార్డు సాధించాడు సుమిత్. ఆ తర్వాత రెండో రౌండ్లో 68.08, ఐదో రౌండ్లో 68.55 మీట్లర్ల దూరం విసిరి మరోసారి తన రికార్డును తానే బద్దలుకొట్టి వరల్డ్ రికార్డుకెక్కాడు. కాగా, ఎఫ్44 విభాగంలో ఆడిన మరో భారత అథ్లెట్ సందీప్ నాలుగో స్థానంలో నిలిచాడు.
అంతకుముందు ఇవాళ ఉదయం(ఆగస్టు 30) జావెలిన్ త్రో లోనూ భారత్ తనదైన ముద్ర వేసింది. ఈ విభాగంలో ఏకంగా రజతం, కాంస్య పతకాలను భారత అథ్లెట్లు కైవసం చేసుకున్నారు. ఎఫ్46 విభాగంలో 64.35 మీటర్ల దూరం విసిరి దేవేంద్ర ఝజారియా(Devendra Javelin Throw) రజతాన్ని సాధించగా.. ఇదే విభాగంలో సుందర్ సింగ్.. 64.01 దూరం విసిరి కాంస్య పతకాన్ని(Sundar Singh Gurjar Bronze) దక్కించుకున్నాడు. దీంతో టోక్యో పారాలింపిక్స్‌లో ఇప్పటివరకు భారత్‌కు 7 పతకాలు సాధించినట్లైంది. అందులో రెండు స్వర్ణాలు, 4 రజతాలు, ఒక కాంస్య పతకాలున్నాయి.
మోదీ శుభాకాంక్షలు
జావెలిన్ త్రోలో స్వర్ణం సాధించిన సుమిత్‌కు అభినందనలు తెలిపారు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ."మన అథ్లెట్లు పారాలింపిక్స్‌లో మంచి ప్రదర్శన కొనసాగిస్తున్నారు. సుమిత్ రికార్డ్ ప్రదర్శనకు దేశమంతటా గర్విస్తోంది. ప్రతిష్ఠాత్మక గోల్డ్ మెడల్ సాధించినందుకు అభినందనలు." అని మోదీ ట్వీట్ చేశారు.