ETV Bharat / sports

ఆ​ టైటిల్ గెలవడమే నా లక్ష్యం: థీమ్​

అస్ట్రేలియన్​ ఓపెన్​లో పాల్గొననున్న ప్రపంచ మూడో ర్యాంకర్‌ డొమినిక్​ థీమ్‌ (ఆస్ట్రియా).. తన తదుపరి పెద్ద లక్ష్యం ఫ్రెంచ్​ ఓపెన్​ టైటిల్​ను గెలవడమేనని చెప్పాడు. ఈ టోర్నీ తనకెంతో ఇష్టమని చెప్పిన ఇతడు.. ఫ్రెంచ్​ ఓపెన్​ టైటిల్​ను సొంతం చేసుకోవడానికి బాగా శ్రమిస్తున్నాని అన్నాడు.

theme
థీమ్​
author img

By

Published : Jan 28, 2021, 9:49 AM IST

ఆస్ట్రేలియన్​ ఓపెన్​ కోసం సిద్ధమవుతోన్న ఆస్ట్రియా కుర్రాడు డొమినిక్‌ థీమ్‌ రొలాండ్​ గారోస్​(ఫెంచ్​ ఓపెన్​) టైటిల్​ను సొంతం చేసుకోవడమే తన తదుపరి పెద్ద లక్ష్యమని అన్నాడు.​​ ఈ టోర్నీలో గెలిచితీరుతానని ధీమా వ్యక్తం చేశాడు.

2018, 19 టోర్నీల్లో ఫైనల్​కు చేరి రఫెల్​ నాదల్​ చేతిలో ఓడాడీ ఆస్ట్రియా ఆటగాడు.

"2020.. క్రీడా ప్రపంచంలో ఓ సంచలనాత్మకం. నా కెరీర్​లో గ్రాండ్‌స్లామ్ గెలిచిన క్షణాలు ఎంతో ఉత్తమమైనవి. నేను దాన్ని మళ్ళీ సాధించాలనుకుంటున్నాను. నా తదుపరి పెద్ద లక్ష్యం 'ఫ్రెంచ్​ ఓపెన్' టైటిల్​ను అందుకోవడమే. చిన్నప్పటి నుంచి ఇదే నా ఫేవరేట్​ టోర్నీ."

-డొమినిక్​ థీమ్​, ఆస్ట్రియా

ఆస్ట్రేలియన్ ఓపెన్​ కోసం అక్కడికి చేరుకున్న ఆటగాళ్లు, సహా సహాయక సిబ్బందిలో కొంతమందికి కరోనా సోకింది. దీంతో దాదాపు 72మంది ఆటగాళ్లను కఠిన క్వారంటైన్​లో ఉంచారు. అయితే కరోనా సోకిన వారికి సన్నిహితంగా ఉండి కూడా నెగెటివ్​ వచ్చిన వారికి మాత్రం కనీసం ప్రాక్టీసు చేయడానికి కూడా వీల్లేదని ఆదేశించారు టోర్నీ నిర్వాహకులు. ముప్పు తక్కువగా ఉన్న మిగతా ఆటగాళ్లకు నిబంధనల్లో కొన్ని సవరణలు చేసి శిక్షణ చేయడానికి కొన్ని గంటల సమయాన్ని కేటాయించారు.

​దీని గురించి మాట్లాడిన థీమ్​.. "ఇదీ ఎంతో దురదృష్టకరమనే చెప్పాలి. ఆటగాళ్లపై భారీగా ప్రభావం చూపుతుంది. ఇంకా కనీసం తొమ్మిది రోజుల పాటు వారు నిర్బంధంలో ఉండాలి. ఏదేమైనప్పటికీ కరోనా పరిస్థితిల్లోనూ ఈ టోర్నీ జరుగుతుందని భావిస్తున్నాను." అని అన్నాడు. ఫిబ్రవరి 8వ తేదీ నుంచి ఆస్ట్రేలియన్​ ఓపెన్​ జరగనుంది.

2011లో కెరీర్​ ప్రారంభించిన థీమ్.. గతేడాది యూఎస్​ ఓపెన్​లో గెలిచి తొలి టైటిల్​ను దక్కించుకున్నాడు.

ఇదీ చూడండి: తొలి గ్రాండ్​స్లామ్​ టైటిల్ కోసం థీమ్​కు తొమ్మిదేళ్లు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.