వింబుల్డన్‌లో(Wimbledon) సెర్బియా స్టార్ నొవాక్ జకోవిచ్(Novak Djokovic) క్వార్టర్ ఫైనల్‌కు చేరుకున్నాడు. సోమవారం జరిగిన పోరులో 6-2, 6-4, 6-2 తేడాతో క్రిస్టియన్ గారిన్ను మట్టికరిపించాడు. ఈ టోర్నీలో క్వార్టర్స్‌కు అతడు చేరుకోవడం ఇది 12వ సారి. ఇందులో గెలిస్తే సెమీఫైనల్లో మార్టన్(హంగేరియా) లేదా ఆండ్రే రుబ్లేవ్(రష్యా)తో తలపడతాడు.
తొలిసారి క్వార్టర్‌ఫైనల్‌కు
మరోవైపు కరెన్ ఖచనోవ్(Karen Khachanov) 3-6, 6-4, 6-3, 5-7, 10-8 తేడాతో సెబస్టియన్ కోర్డాను(Sebastian Korda) ఓడించి ఈ రౌండ్‌కు తొలిసారి చేరుకున్నాడు. తర్వాతి రౌండ్లో డెనిస్ షపొవాల్వొను ఎదుర్కొనున్నాడు.
ఆస్ట్రేలియాకు చెందిన యాష్ బార్టీ(Ash Barty) 7-5,6-3తేడాతో బార్బొరా క్రెజ్కోవ్ను(Barbora Krejckov ) ఓడించింది. ఇగా స్వియాటెక్‌పై(Iga Swiatek) 5-7,6-1,6-1 తేడాతో ఆన్స్ జాబిర్(Ons Jabeur) గెలుపొందింది. అరినా సబలంకా చేతిలో 6-3,4-6,6-3,తేడాతో ఎలినా రిబకినా ఓటమి చెందింది.
-
#Wimbledon quarter-finalist for a 12th time...
— Wimbledon (@Wimbledon) July 5, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
Defending champion @DjokerNole defeats Cristian Garin 6-2, 6-4, 6-2 to reach the final eight pic.twitter.com/skJOrqvjx3
">#Wimbledon quarter-finalist for a 12th time...
— Wimbledon (@Wimbledon) July 5, 2021
Defending champion @DjokerNole defeats Cristian Garin 6-2, 6-4, 6-2 to reach the final eight pic.twitter.com/skJOrqvjx3#Wimbledon quarter-finalist for a 12th time...
— Wimbledon (@Wimbledon) July 5, 2021
Defending champion @DjokerNole defeats Cristian Garin 6-2, 6-4, 6-2 to reach the final eight pic.twitter.com/skJOrqvjx3
ఇదీ చూడండి: నా కూతురికి 'తారా' పేరు అందుకే పెట్టా: జకోవిచ్