ETV Bharat / sports

ఆస్ట్రేలియన్​ ఓపెన్​ బరిలో సుమిత్​ నగాల్​ - మెల్​బోర్న్​ పార్క్​ టెన్నిస్​

భారత టెన్నిస్​ ప్లేయర్ సుమిత్​ నగాల్ సదావకాశం దక్కించుకున్నాడు. త్వరలో ప్రారంభమయ్యే ఆస్ట్రేలియన్​ ఓపెన్​ వైల్డ్​కార్డ్​ ఎంట్రీ అతడికి లభించింది. ఈ మేరకు ట్విట్టర్​ వేదికగా తన ఆనందాన్ని పంచుకున్నాడు.

Sumit Nagal receives wildcard for Australian Open 2021
ఆస్ట్రేలియన్​ ఓపెన్​ బరిలో సుమిత్​ నగాల్​
author img

By

Published : Dec 28, 2020, 3:33 PM IST

వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరిగే ఆస్టేలియన్​ ఓపెన్​ వైల్డ్​ కార్డ్ ఎంట్రీగా భారత టెన్నిస్​ క్రీడాకారుడు సుమిత్​ నగాల్​కు అవకాశం లభించింది. ఈ టోర్నీలోని ఆసియా-పసిఫిక్​ వైల్డ్​కార్డ్​ ఎంట్రీల కింద భారత్​కు చెందిన సుమిత్​, చైనాకు చెందిన ​వాంగ్​ షియూలు డ్రాలో ఎంపికయ్యారు. క్రిస్మస్​ సందర్భంగా కొన్ని వైల్డ్​కార్డ్​ ఎంట్రీలు ప్రకటించగా డారియా గ్రావిలోవా, అస్త్ర శర్మ, క్రిస్టోఫర్​ ఓకానెల్​, మాడిసన్​ ఇంగ్లిస్​, లిజెట్ట కబ్రేరా, మార్క్​ పోల్మాన్స్​లు ఆ జాబితాలో ఉన్నారు.

  • I am very thankful to all the people who put effort in helping me get a wild card for the 2021 Australian Open

    Thanks to Tennis Australia for all their effort to make this slam possible in this circumstances pic.twitter.com/1Sbv8tVVyD

    — Sumit Nagal (@nagalsumit) December 27, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

"ఆస్ట్రేలియన్​ ఓపెన్​-2021 వైల్డ్​కార్డ్​ అవకాశం లభించడానికి సహకరించిన వారందరికి ధన్యవాదాలు. ఇలాంటి పరిస్థితుల్లో టోర్నీ నిర్వహిస్తున్నందుకు టెన్నిస్​ ఆస్ట్రేలియా ధన్యవాదాలు" అని సుమిత్​ నగాల్​ ట్వీట్​ చేశాడు.

ఆస్ట్రేలియన్​ ఓపెన్​ను మెల్​బోర్న్​​ వేదికగా ఫిబ్రవరి 8 నుంచి 21 మధ్య నిర్వహించనున్నారు. ఇందులో సింగిల్స్​, డబుల్స్​, వీల్​ఛైర్​ విభాగాల్లో మ్యాచ్​లు జరగనున్నాయి.

ఇదీ చూడండి: ఐసీసీ అవార్డులు- ధోనీకి స్పిరిట్ ఆఫ్ క్రికెట్ అవార్డు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.