ETV Bharat / sports

సునాయాసంగా ప్రిక్వార్టర్స్​లోకి నాదల్​ - ఆస్ట్రేలియన్​ ఓపెన్​

స్పెయిన్​ టెన్నిస్​ స్టార్​ రఫెల్​ నాదల్​ ఆస్ట్రేలియన్​ ఓపెన్లో ప్రిక్వార్టర్స్​కు దూసుకెళ్లాడు. యువ ఆటగాళ్లు సిట్సిపాస్​, మెద్వెదెవ్​లూ తదుపరి రౌండ్​కు అర్హత సాధించారు.

Spanish tennis star Rafael Nadal has advanced to the quarterfinals of the Australian Open
సునాయాసంగా ప్రిక్వార్టర్స్​లోకి నాదల్​
author img

By

Published : Feb 14, 2021, 6:39 AM IST

స్పెయిన్‌ బుల్‌ రఫెల్‌ నాదల్‌ ఆస్ట్రేలియన్‌ ఓపెన్లో దూసుకెళ్తున్నాడు. అతడు పెద్దగా ఇబ్బందిపడకుండానే ప్రిక్వార్టర్స్‌లో అడుగుపెట్టాడు. యువ కెరటాలు సిట్సిపాస్‌, మెద్వెదెవ్‌ కూడా ముందంజ వేయగా.. మహిళల సింగిల్స్‌లో టాప్‌సీడ్‌ బార్టీ, స్వితోలినా మూడో రౌండ్‌ అధిగమించారు. సీడెడ్‌ క్రీడాకారిణులు ప్లిస్కోవా (6), బెన్సిచ్‌ (11) మూడో రౌండ్లోనే ఇంటిముఖం పట్టారు.

దిగ్గజ ఆటగాడు రఫెల్‌ నాదల్‌ ఆస్ట్రేలియన్‌ ఓపెన్లో మరో అడుగు ముందుకేశాడు. శనివారం జరిగిన పురుషుల సింగిల్స్‌ మూడో రౌండ్లో రెండో సీడ్‌ నాదల్‌ 7-5, 6-2, 7-5తో అన్‌సీడెడ్‌ కామెరూన్‌ నోరి (బ్రిటన్‌)ను ఓడించాడు. ఈ పోరులో ప్రత్యర్థి నుంచి కాస్త ప్రతిఘటన ఎదురైనా నాదల్‌ మాత్రం వెనక్కి తగ్గలేదు. 7 ఏస్‌లు, 33 విన్నర్లు కొట్టిన రఫా.. అయిదుసార్లు ప్రత్యర్థి సర్వీస్‌ బ్రేక్‌ చేశాడు. ఆస్ట్రేలియన్‌ ఓపెన్లో ప్రిక్వార్టర్స్‌ చేరడం ఈ స్పెయిన్‌ వీరుడికి ఇది పద్నాలుగోసారి.

మెద్వెదెవ్‌ కష్టంగా..

రష్యా కుర్రాడు డానియల్‌ మెద్వెదెవ్‌ కష్టం మీద మూడో రౌండ్‌ అధిగమించాడు. ఈ నాలుగో సీడ్‌ ఆటగాడు.. 6-3, 6-3, 4-6, 3-6, 6-0 తేడాతో అన్‌సీడెడ్‌ ఫిలిప్‌ క్రాజినోవిచ్‌ (సెర్బియా)ను ఓడించాడు. ఈ పోరులో తొలి రెండు సెట్లు గెలిచి మెద్వెదెవ్‌ ఊపు మీద కనిపించాడు. కానీ మూడు, నాలుగు సెట్లు చేజిక్కించుకున్న క్రాజినోవిచ్‌.. మెద్వెదెవ్‌కు సవాల్‌ విసిరాడు. అయితే నిర్ణయాత్మక ఆఖరి సెట్లో విజృంభించి ఆడి డానియల్‌.. ప్రత్యర్థికి ఒక్క గేమ్‌ కూడా గెలిచే అవకాశం ఇవ్వకుండా 6-0తో సెట్‌తో పాటు మ్యాచ్‌ను కైవసం చేసుకున్నాడు.

మరో మ్యాచ్‌లో గ్రీసు కెరటం సిట్సిపాస్‌ 6-4, 6-1, 6-1తో మైకేల్‌ యెమిర్‌ (స్వీడన్‌)ను ఓడించాడు. తొలి సెట్లో తప్ప సిట్సిపాస్‌ ధాటికి మైకేల్‌ నిలువలేకపోయాడు. ఫాగ్‌నిని (ఇటలీ), బెరిటిని (ఇటలీ), మెక్‌డొనాల్డ్‌ (అమెరికా), రుబ్‌లెవ్‌ (రష్యా), రూడ్‌ (నార్వే) ప్రిక్వార్టర్స్‌లో ప్రవేశించారు. ఏడోసీడ్‌ రుబ్‌లెవ్‌ 7-5, 6-2, 6-3తో లోపెజ్‌ (స్పెయిన్‌)ను ఓడించగా, ఫాగ్‌నిని 6-4, 6-3, 6-4తో డిమినర్‌ (ఆస్ట్రేలియా)పై, మెక్‌డొనాల్డ్‌ 7-6 (9-7), 6-1, 6-4తో హారిస్‌ (దక్షిణాఫ్రికా)పై, రూడ్‌ 6-1, 5-7, 6-4, 6-4తో అల్బాట్‌ (మల్దోవా)పై విజయం సాధించారు.

బార్టీ ముందుకు..

టైటిల్‌పై గురిపెట్టిన టాప్‌సీడ్‌ ఆష్లె బార్టీ (ఆస్ట్రేలియా) ఆ దిశగా అడుగులు వేస్తోంది. ఆమె అలవోకగా ప్రిక్వార్టర్స్‌ చేరింది. మూడో రౌండ్లో బార్టీ 6-2, 6-4తో ఎక్తరీనా అలెగ్జాండ్రోవా (రష్యా)ను ఓడించింది. ఆరోసీడ్‌ ప్లిస్కోవా (చెక్‌ రిపబ్లిక్‌), 11వ సీడ్‌ బెన్సిచ్‌ (స్విట్జర్లాండ్‌), 21వ సీడ్‌ కొంటావిట్‌ (లాత్వియా) ఇంటిముఖం పట్టారు.

Spanish tennis star Rafael Nadal has advanced to the quarterfinals of the Australian Open
బార్టీ

ప్లిస్కోవా 5-7, 5-7తో తన దేశానికే చెందిన ముచోవా చేతిలో ఓడగా.. బెన్సిచ్‌ 2-6, 1-6తో మెర్టిన్స్‌ (బెల్జియం) చేతిలో పరాజయం చవిచూసింది. అన్‌సీడెడ్‌ రోజర్స్‌ (అమెరికా) 6-4, 6-3తో 21వ సీడ్‌ కొంటావిట్‌ (ఇస్తోనియా)కు షాకిచ్చింది. అయిదో సీడ్‌ స్వితోలినా (ఉక్రెయిన్‌)తో పాటు వికిచ్‌ (చెక్‌ రిపబ్లిక్‌), బ్రాడీ (అమెరికా), జెస్సికా (అమెరికా) ప్రిక్వార్టర్స్‌ చేరారు.

బోపన్న ఔట్‌..

ఆస్ట్రేలియన్‌ ఓపెన్లో భారత పోరాటం ముగిసింది. మిక్స్‌డ్‌ డబుల్స్‌ బరిలో ఉన్న రోహన్‌ బోపన్న కూడా ఓడిపోయాడు. తొలి రౌండ్లో బోపన్న-యింగ్‌యింగ్‌ డన్‌ (చైనా) 4-6, 4-6తో బెథానీ మాటెక్‌ (అమెరికా)-జేమి ముర్రే (బ్రిటన్‌) చేతిలో వరుస సెట్లలో పరాజయం పాలయ్యారు. డబుల్స్‌లోనూ బోపన్న తొలి రౌండ్లోనే ఓడాడు. డబుల్స్‌లో దివిజ్‌ శరణ్‌, అంకిత రైనాతో పాటు సింగిల్స్‌ సుమిత్‌ నగాల్‌ ఆరంభ రౌండ్లోనే పరాజయం చవిచూసిన సంగతి తెలిసిందే.

ఇదీ చదవండి: వివాదాస్పద డీఆర్​ఎస్​పై ఇంగ్లాండ్ అసహనం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.