యూఎస్ ఓపెన్లో అమెరికా టెన్నిస్ దిగ్గజం సెరెనా విలియమ్స్ జోరు చూపించింది. ఆర్థర్ ఆష్ స్టేడియం వేదికగా జరిగిన తొలి మ్యాచ్లో రష్యా టెన్నిస్ స్టార్ మారియా షరపోవాపై విజయం సాధించింది.
సెరెనా ముందు మాజీ ఛాంపియన్ షరపోవా చిన్నబోయింది. మొదటి నుంచి ఆధిపత్యం వహించిన సెరెనా 59 నిమిషాల్లో ఆటను పూర్తి చేసింది. 6-1, 6-1 తేడాతో గెలిచి రెండో రౌండ్లో అడుగుపెట్టింది.
"షరపోవా మంచి ప్లేయర్. ఆమెతో ఆడినప్పుడు చాలా ఏకాగ్రతగా ఉంటూ.. ఉత్తమ ప్రదర్శన ఇవ్వడానికి ప్రయత్నిస్తుంటా" -సెరెనా విలియమ్స్, అమెరికా టెన్నిస్ క్రీడాకారిణి
ఇప్పటికే యూఎస్ ఓపెన్లో ఆరుసార్లు విజేతగా నిలిచింది సెరెనా. ఏడోసారి టైటిల్ ముద్దాడాలని చూస్తోంది.
ఎనిమిదో సీడ్ సెరెనా రెండో రౌండ్లో 121 ర్యాంకులో ఉన్న మరో అమెరికా టెన్నిస్ ప్లేయర్ మెక్నల్లీతో తలపడనుంది.