భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జాకు దుబాయ్ 'గోల్డెన్ వీసా' మంజూరైంది. ఈ వీసాతో సానియా, ఆమె భర్త షోయబ్ మాలిక్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో పదేళ్ల పాటు నివసించేందుకు వీలు కలుగుతుంది. భారత్ నుంచి బాలీవుడ్ స్టార్స్ షారుక్ ఖాన్, సంజయ్ దత్ తర్వాత ఈ గౌరవ వీసా అందుకున్న మూడో వ్యక్తిగా సానియా నిలిచింది.
తనకు యూఏఈ ప్రభుత్వం నుంచి ఈ అరుదైన గౌరవం దక్కడంపై హర్షం వ్యక్తం చేసింది సానియా. దుబాయ్ యువరాజు షేక్ మహ్మద్ బిన్ రషీద్, అక్కడి పౌరసత్వ అధికార యంత్రాంగానికి, క్రీడా శాఖకు ధన్యవాదాలు తెలిపింది. దుబాయ్ తనకు రెండో ఇల్లు లాంటిదని చెప్పిన ఆమె.. అక్కడే ఎక్కువగా గడపాలని ఎదురుచూస్తున్నట్లు వెల్లడించింది. త్వరలోనే అక్కడ టెన్నిస్, క్రికెట్ అకామీలు సానియా దంపతులు స్థాపించనున్నారు. ప్రస్తుతం ఆమె టోక్యో ఒలింపిక్స్‌కు సన్నద్ధమవుతోంది.
ఇదీ చూడండి: OLYMPICS: టోక్యో ఒలింపిక్స్‌తో సానియా రికార్డు!