ETV Bharat / sports

French Open నుంచి ఫెదరర్​ నిష్క్రమణ

దిగ్గజ టెన్నిస్ క్రీడాకారుడు రోజర్​ ఫెదరర్(Roger Federer)​ ఫ్రెంచ్​ ఓపెన్​(French open) నుంచి వైదొలగిన్నట్లు ప్రకటించాడు. ఇటీవల తన మోకాలికి జరిగిన శస్త్రచికిత్స కారణంగా శరీరానికి విశ్రాంతి అవసరమైన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించాడు.

Roger Federer
ఫెదరర్
author img

By

Published : Jun 6, 2021, 9:25 PM IST

స్విస్​ టెన్నిస్ దిగ్గజం రోజర్​ ఫెదరర్​(Roger Federer) ఫ్రెంచ్ ఓపెన్​(French open) నుంచి వైదొలిగాడు. ఈ విషయాన్ని అతడే స్వయంగా ప్రకటించాడు. మోకాలి గాయంతో బాధపడుతున్న రోజర్​.. ప్రస్తుత టోర్నీలో నాలుగో రౌండ్​కు చేరుకున్నాడు.

"నా టీమ్​తో చర్చించాక ఈ టోర్నీ నుంచి నిష్క్రమించాలని నిర్ణయం తీసుకున్నాను. నా మోకాళ్లకు జరిగిన శస్త్రచికిత్స కారణంగా శరీరానికి విశ్రాంతి అవసరం"

-రోజర్ ఫెదరర్, స్విస్ టెన్నిస్ ప్లేయర్

మూడో రౌండ్​లో లిథువేనియా ఆటగాడు రికార్డాస్ బెర్కిన్స్​పై విజయం సాధించి నాలుగో రౌండ్​కు అర్హత సాధించాడు ఫెదరర్​. ఇప్పటికే 20 గ్రాండ్​ స్లామ్​లు గెలుపొందిన రోజర్​.. గతేడాది రెండు మోకాళ్లకు శస్త్రచికిత్సలు చేయించుకున్నాడు.

ఇదీ చూడండి French Open: టైటిల్​ వేటలో నాదల్​కు ఎదురుందా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.