ఫ్రెంచ్ ఓపెన్ విజేత స్పెయిన్ బుల్ రఫెల్ నాదల్ యూఎస్ ఓపెన్ సెమీస్‌కు చేరాడు. న్యూయార్క్‌లో జరిగిన పురుషుల సింగిల్స్ క్వార్టర్స్‌లో అర్జెంటీనాకు చెందిన డీగో స్క్వాట్జ్మాన్పై విజయం సాధించాడు. సెమీస్‌లో ఇటలీకి చెందిన మ్యాటో బెరెత్తెనితో తలపడనున్నాడు.
డీగోపై 6-4, 7-5, 6-2 తేడాతో వరుస సెట్లలో విజయం సాధించాడు రఫా. స్పెయిన్ బుల్‌కు ఈ గెలుపు అంత సులభంగా రాలేదు. అర్జెంటీనా క్రీడాకారుడి నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురైంది. రెండు గంటల 46 నిమిషాలు పాటు సాగిన ఈ మ్యాచ్‌లో నాదల్ చెమటోడ్చాల్సి వచ్చింది.
ముఖ్యంగా తొలి రెండు సెట్లలో డీగో అద్భుతంగా పోరాడాడు. అయితే అనభవజ్ఞుడైన నాదల్ ప్రత్యర్థి ఎదురుదాడిని తిప్పికొట్టాడు. ఫలితంగా రెండు సెట్లలోనూ విజయం సాధించాడు. మూడో సెట్లో అర్జెంటీనా ప్లేయర్ సులభంగానే రఫాకు లొంగిపోయాడు.
బుదవారం జరిగిన క్వార్టర్స్‌లో గేల్ మోనోఫిస్పై 3-6, 6-3, 6-2, 3-6, 7-6(5) తేడాతో తీవ్రంగా శ్రమించి గెలిచాడు ఇటలీ ఆటగాడు మ్యాటో బెరెత్తిని. యూఎస్ ఓపెన్‌లో 42 ఏళ్ల తర్వాత సెమీస్ చేరిన ఇటలీ క్రీడాకారుడిగా బెరెత్తిని రికార్డు సృష్టించాడు. సెమీస్‌లో నాదల్‌తో తలపడనున్నాడు.
ఇది చదవండి: మళ్లీ ఆదుకున్న స్మిత్... ఆసీస్ స్కోరు 170/3