ETV Bharat / sports

అట్లాంటిక్‌ టైర్‌ టోర్నీ క్వార్టర్స్​లో​ ప్రజ్నేశ్​

author img

By

Published : Nov 14, 2020, 7:18 AM IST

భారత స్టార్​ ఆటగాడు ప్రజ్నేశ్​ గుణేశ్వరనన్..​ అట్లాంటిక్‌ టైర్‌ టెన్నిస్‌ ఛాంపియన్‌షిప్‌లో క్వార్టర్​ ఫైనల్లో అడుగుపెట్టాడు. అమెరికా ఆటగాడిపై నెగ్గి ఈ అర్హత సాధించాడు.

prajnesh guneshwaran has entered into the quarter finals of atlantic tire tennis championship
అట్లాంటిక్‌ టైర్‌ టోర్నీ క్వార్టర్​లో​ ప్రజ్నేశ్​ గుణేశ్వరన్​

అట్లాంటిక్‌ టైర్‌ టెన్నిస్‌ ఛాంపియన్‌షిప్‌లో భారత స్టార్‌ ఆటగాడు ప్రజ్నేశ్‌ గుణేశ్వరన్‌ దూసుకెళ్తున్నాడు. అతను ఈ టోర్నీలో క్వార్టర్‌ఫైనల్లో ప్రవేశించాడు. శుక్రవారం జరిగిన పురుషుల సింగిల్స్‌ ప్రిక్వార్టర్స్‌లో నాలుగో సీడ్‌ ప్రజ్నేశ్‌ 6-7 (3-7), 6-2, 7-6 (7-5)తో జాక్‌ సాక్‌ (అమెరికా)పై చెమటోడ్చి గెలిచాడు.

తొలి సెట్‌ కోల్పోయినా.. పట్టుదలతో ఆడిన ప్రజ్నేశ్‌.. రెండో సెట్లో గెలిచి మ్యాచ్‌లో నిలిచాడు. మూడో సెట్లో టైబ్రేకర్‌లో 5-5తో ఉన్న సమయంలో ఒత్తిడిని జయించి వరుసగా రెండు పాయింట్లు సాధించి విజయాన్ని సొంతం చేసుకున్నాడు. ఈ పోరులో అయిదు ఏస్‌లు కొట్టిన గుణేశ్వరన్‌.. మూడుసార్లు ప్రత్యర్థి సర్వీస్‌ బ్రేక్‌ చేశాడు.

ఇదీ చదవండి:ఆ విషయం రోహిత్​నే అడగండి: గంగూలీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.