ETV Bharat / sports

ఆస్ట్రేలియన్​ ఓపెన్​: నాదల్ ముందుకు​.. సుమిత్​ ఔట్​ - ఆస్ట్రేలియన్ ఓపెన్​

ఆస్ట్రేలియన్​ ఓపెన్​లో భాగంగా రెండో రోజు(ఫిబ్రవరి 9) జరిగిన తొలి రౌండ్​లో సెర్బియా స్టార్​ రఫెల్​ నాదల్​, ఆస్ట్రేలియా స్టార్ యష్​ బార్టీ అదరగొట్టారు. తొలి మ్యాచుల్లో నెగ్గి రెండో రౌండ్​లోకి అడుగుపెట్టారు. భారత టెన్నిస్​ స్టార్ సుమిత్​ ఓటమిపాలై టోర్నీ నుంచి నిష్క్రమించాడు.

nadal
నాదల్​
author img

By

Published : Feb 9, 2021, 5:19 PM IST

ఆస్ట్రేలియన్​ ఓపెన్​లో భాగంగా రెండో రోజ(మంగళవారం) జరిగిన తొలిరౌండ్​లో స్పెయిన్‌ టెన్నిస్​ దిగ్గజం రఫెల్‌ నాదల్ సహా పలువురు స్టార్​ ఆటగాళ్లు శుభారంభం చేశారు. ‌ వారెవరంటే..

  • సెర్బియాకు చెందిన లాస్లొ డెరెను వరుస సెట్లలో 6-3,6-4,6-1 తేడాతో ఓడించాడు సెర్బియా స్టార్​ నాదల్​. ఫలితంగా రెండో రౌండ్​లోకి ప్రవేశించాడు.
  • కెనెడా ప్లేయర్​ వాసెక్​ పోస్​పిసిల్​పై 6-2,6-2,6-4 తేడాతో విజయం సాధించాడు రష్యాకు చెందిన డేనియల్​ మెద్వెదేవ్​.
  • సెర్బియాకు చెందిన యువ ఆటగాడు కార్లోస్​ అల్​కెరజ్​ వరుస సెట్లలో 6-1,6-4,6-4 తేడాతో డచ్​ టెన్నిస్​ ఆటగాడు బొటిక్​ వన్​ ద జ్యాండ్​షల్ప్​ను ఓడించి తొలి రౌండ్​లో నెగ్గాడు.

మహిళల సింగిల్స్​.. యష్​ బార్టీ (ఆస్ట్రేలియా)

  • దాదాపు ఏడాది తర్వాత ఆడుతోన్న తన తొలి గ్రాండ్​ స్లామ్​ మ్యాచులో ఆస్ట్రేలియా టాప్​ టెన్నిస్​ ప్లేయర్​ యష్​ బార్టీకి అదిరే ఆరంభం దక్కింది. ఆస్ట్రేలియన్ ఓపెన్​ తొలి రౌండ్​లో డంకా కొవినిక్​ను 6-0,6-0 తేడాతో ఓడించి రెండో రౌండ్​లోకి అడుగుపెట్టింది

సుమిత్​ ఔట్​

  • భారత టెన్నిస్‌ స్టార్‌ సుమిత్‌ నగల్‌ ఈ టోర్నీ నుంచి నిష్క్రమించాడు. పురుషుల సింగిల్స్‌ విభాగంలో తొలి రౌండ్‌లో లిథూనియా ఆటగాడు ఆర్‌ బెకరిస్‌ చేతిలో ఓటమిపాలయ్యాడు. దీంతో ఈ టోర్నీ నుంచి సుమిత్‌ వైదొలిగాడు. రెండు గంటలకు పైగా సాగిన ఈ మ్యాచ్‌లో ఆది నుంచి ఆధిపత్యం చెలాయించిన బెకరిస్‌ చివరికి ఏ సెట్‌లోనూ సుమిత్‌కు అవకాశం ఇవ్వలేదు. భారత స్టార్‌ రెండో సెట్‌లో గట్టి పోటీ ఇచ్చినా చివరికి బెకరిస్‌ ముందు నిలవలేకపోయాడు. ఈ క్రమంలోనే 2-6, 5-7, 3-6 తేడాతో ఓటమిపాలయ్యాడు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.