ETV Bharat / sports

12వ సారి నాదల్​కు టైటిల్​ దక్కేనా? - Barcelona Open final

ఆదివారం జరిగే బార్సిలోనా ఓపెన్​ ఫైనల్లో తలపడనున్నారు టెన్నిస్ స్టార్లు నాదల్, సిట్సిపాస్. నాదల్​ ఇప్పటికే 11 సార్లు ఈ టైటిల్​ను గెలిచాడు.

Barcelona Open final, Tsitsipas
బార్సిలోనా ఓపెన్, రఫెల్ నాదల్
author img

By

Published : Apr 25, 2021, 11:33 AM IST

కెరీర్​లో 12వ సారి బార్సిలోనా ఓపెన్ ఫైనల్లోకి ప్రవేశించాడు స్పెయిన్​ టెన్నిస్ దిగ్గజం రఫెల్ నాదల్. నేడు (ఆదివారం) జరిగే ఫైనల్లో గ్రీక్​ టెన్నిస్ స్టార్ స్టెఫానోస్ సిట్సిపాస్​తో తలపడనున్నాడు. టాప్​ సీడ్ నాదల్​.. ఇప్పటికే ఫైనల్​ చేరిన 11 సార్లు బార్సిలోనా ఓపెన్​లో ఛాంపియన్​గా నిలిచాడు.

సెమీఫైనల్లో స్పెయిన్​కు చెందిన కరేనో బుస్టాను 6-3, 6-2తో మట్టికరిపించి.. నాదల్​ టైటిల్​ పోరుకు దూసుకెళ్లాడు. ఇటలీకి చెందిన జన్నిక్ సిన్నర్​పై 6-3, 6-3 తేడాతో గెలిచి ఫైనల్​కు చేరాడు యువ సంచలనం సిట్సిపాస్.

హోరాహోరీ..

నాదల్, సిట్సిపాస్​ల ఫైనల్​ పోరు హోరాహోరీగా సాగనుంది. 2018లో జరిగిన బార్సిలోనా ఫైనల్లో సిట్సిపాస్​ను నాదల్ ఓడించాడు. అయితే 2019 మాడ్రిడ్​ సెమీఫైనల్లో నాదల్​పై సిట్సిపాస్​ పైచేయి సాధించాడు. గతవారం జరిగిన మోంటే కార్లే మాస్టర్స్​ టైటిల్​ నెగ్గి జోరుమీదున్నాడు గ్రీకు కుర్రాడు.

ఇదీ చూడండి: ఫ్రెంచ్​ ఓపెన్​లో బరిలోకి దిగుతా: ఫెదరర్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.