స్పెయిన్ బుల్ రఫెల్ నాదల్ ఖాతాలో మరో టైటిల్ చేరింది. కెనడా ఓపెన్(రోజర్స్ కప్) ఫైనల్లో రష్యాకు చెందిన డ్యానిల్ మెద్వదేవ్‌పై గెలిచాడు. ఈ విజయంతో 35వ మాస్టర్స్ టైటిల్‌ను కైవసం చేసుకున్నాడు. కేవలం 70 నిమిషాల్లోనే మ్యాచ్ ముగించాడు రఫా.
కెనడా మాంట్రియోల్లో జరిగిన ఈ టోర్నమెంట్లో పురుషుల సింగిల్స్ విభాగంలో 6-3, 6-0 తేడాతో విజయం సాధించాడు. మట్టికోర్టులో ప్రతాపం చూపించే నాదల్.. హార్డ్ కోర్టులో తొలిసారిగా ప్రత్యర్థిని డిఫెండ్ చేసి విజేతగా నిలిచాడు.
"ఆరంభం నుంచి మ్యాచ్ అనుకూలంగా మార్చుకోవడం చాలా ముఖ్యం. పరిస్థితులకు తగ్గట్లుగా తెలివిగా ఆడాననుకుంటున్నా. అతడు(మెద్వదేవ్) చాలా బాగా ఆడాడు. " -రఫెల్ నాదల్, స్పెయిన్ క్రీడాకారుడు.
మహిళల సింగిల్స్ విభాగంలో సెరెనా విలియమ్స్‌పై బియాంకా ఆండ్రెస్కు విజయం సాధించింది. నడుంనొప్పి కారణంగా సెరెనా ఆట కొనసాగించలేకపోయింది. బియాంకా ఆండ్రెస్కును విజేతగా ప్రకటించారు రిఫరీ.
ఇదీ చదవండి: రోజర్స్ కప్ బియాంకాదే.. ఫైనల్లో సెరెనాపై విజయం