ప్రముఖ గ్రాండ్‌స్లామ్ టోర్నీ ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో భారత పోరాటం ముగిసింది. మిక్స్డ్ డబుల్స్‌లో ఇవాళ జరిగిన క్వార్టర్స్‌లో రోహన్ బోపన్న ద్వయం ఓడిపోయింది. ప్రత్యర్థి జట్టు ఐదో సీడ్ నికోలా మెక్టిక్-బార్బోరా క్రిజికోవా జంట చేతిలో 6-0, 6-2 తేడాతో పరాజయం చెందింది బోపన్న-నదియా జోడీ.
మిక్స్డ్ డబుల్స్‌లో భారత క్రీడాకారిణి సానియా మీర్జాతో కలిసి బోపన్న బరిలోకి దిగాల్సింది. కానీ ఆమె కాలిపిక్క గాయం కారణంగా టోర్నీ ఆరంభంలోనే తప్పుకోగా.. నదియా కిచనోవ్(ఉక్రెయిన్)తో కలిసి బరిలోకి దిగాడు. క్వార్టర్స్‌లో ఓడిపోవడం వల్ల ఈ ఏడాది తొలి గ్రాండ్‌స్లామ్ టోర్నీలో భారత్‌కు నిరాశ ఎదురైంది.
బుధవారం జరిగిన మిక్స్డ్ డబుల్స్ మ్యాచ్‌లో భారత సీనియర్ టెన్నిస్ ఆటగాడు లియాండర్ పేస్ జోడీ రెండో రౌండ్లోనే ఇంటిముఖం పట్టింది. ఇందులో జెలెనా ఒత్సపెంకో(లాత్వియా)తో కలిసి బరిలోకి దిగాడు పేస్. ఈ మ్యాచ్‌లో బెనాతీ- బ్రిటాన్ జామీ ముర్రే చేతిలో 6-2, 7-5 తేడాతో ఓడిపోయింది పేస్ ద్వయం.