భారత డెవిస్‌కప్ టీమ్ పాకిస్థాన్ వెళ్లనుంది. 55 ఏళ్ల తర్వాత దాయాది జట్టులో టెన్నిస్ టోర్నీ ఆడనుంది. ఇందుకు సంబంధించి అఖిల భారత టెన్నిస్ సంఘం (ఏఐటీఏ) కేంద్ర ప్రభుత్వం అనుమతి తీసుకుంది. చివరి సారిగా 1964లో భారత్ లాహోర్ వెళ్లింది.
"డెవిస్కప్లో ఆడేందుకు పాకిస్థాన్ వెళ్లడానికి కేంద్రానికి లేఖ రాశాం. ఇది ద్వైపాక్షిక సిరీస్ కాకపోవడంతో ప్రభుత్వం పాక్ వెళ్లేందుకు అనుమంతించింది" -హిరోన్మయి ఛటర్జీ, ఏఐటీఏ జనరల్ సెక్రటరీ
మహేశ్ భూపతి, లియాండర్ పేస్, ప్రకాశ్ అమృతరాజ్, రోహన్ బోపన్నలతో కూడిన జట్టు పాక్‌కు వెళ్లనుంది. చివరగా ఇరు దేశాలు 2006 ముంబయిలో జరిగిన మ్యాచ్‌లో తలపడ్డాయి. 3-2 తేడాతో భారత్ విజయం సాధించింది.
ఇది చదవండి: కివీస్‌కు తొలి ఓటమి.. పాక్ చేతిలో పరాభవం